• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • PGCIL POWERGRID UP RECRUITMENT 2021 APPLICATIONS INVITED FOR DIPLOMA TRAINEE POSTS HERE FULL DETAILS NS

PGCIL Powergrid Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

ప్రతీకాత్మక చిత్రం

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి ఉద్యోగాల భర్తీకి అధికారులు మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(PGCIL) నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల సంస్థ నుంచి వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా సంస్థ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. డిప్లొమో ట్రైనీ విభాగంలో ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 18న ప్రారంభమైంది. దరఖాస్తుకు జులై 8ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ను ఆగస్టు మూడో వారంలో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    MIDHANI Recruitment 2021: హైదరాబాద్ మిథానిలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూలే.. అప్లై చేయాల్సిన అవసరం లేదు..

    ఖాళీలు, అర్హతల వివరాలు..
    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 15 ఖాళీలు డిప్లొమో ట్రైనీ(ఎలక్ట్రికల్), మరో ఐదు ఖాళీలు డిప్లొమో ట్రైనీ(సివిల్) విభాగంలో ఉన్నాయి. సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమో కోర్సును గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు కనీసం 70 శాతం మార్కులు సాధించి ఉండాలి.
    Application - Direct Link

    డిప్లొమో లేకుండా బీటెక్/ఎంటెక్/ఎంఈ తదితర విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అనర్హులు. వయోపరిమితిని 27 ఏళ్లుగా నిర్ణయించారు. ఓబీసీ అభ్యర్థులకు 30 ఏళ్లు, ఎస్సీ అభ్యర్థులకు 32 ఏళ్లను వయో పరిమితిగా నిర్ణయించారు.

    ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు చెప్పింది. ఈ మేరకు తాజాగా సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.  NVH India (Auto Parts Pvt Ltd)లో ఉద్యోగాల భర్తీకి ఈ నియామకాలను చేపట్టారు. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. రిజిస్ట్రేషన్ కు ఈ నెల 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలను ఈ నెల 22న ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తారు. ఇతర పూర్తి వివరాలకు 7989888299, 9010039901 నంబర్లను సంప్రదించవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published: