ఈ రోజుల్లో ఏ జాబ్‌కి అప్లై చేయాలన్నా రెజ్యూమ్(Resume) తప్పనిసరిగా సమర్పించాల్సి వస్తోంది. వీటిలో అభ్యర్థికి సంబంధించిన పూర్తి వివరాలను పేర్కొంటారు. అయితే రెజ్యూమ్‌తో పాటు కవర్‌లెటర్ కూడా ఆకట్టుకునేలా ఉండటం తప్పనిసరి. రెజ్యూమ్‌లో బుల్లెట్ పాయింట్స్ ఉంటే, కవర్ లెటర్‌లో(Cover Letter) ప్యారాల్లో వివరణ ఉండాలి. రెజ్యూమ్, కవర్‌లెటర్(Resume, Cover letter) అంటే ఇలానే ఉండాలి అనే కచ్చితమైన ఫార్మాట్ ఎక్కడా లేదు. అయితే మన దగ్గర ఉన్న వివరాలతో ఆకర్షణీయంగా వీటిని ఎలా తయారు చేసుకోవచ్చో చెబుతోంది హర్వర్డ్ యూనివర్సిటీ (Harvard University). వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ కథనం చదివేయండి.
మంచి రెజ్యూమ్ కోసం హార్వర్డ్ యూనివర్సిటీ టిప్స్
పెద్ద కంపెనీలు రెజ్యూమ్‌ని చూడటానికి ఎక్కువ సమయం కేటాయించవు. అందుకే ఎవరైనా సరే, ఒక్కసారి చూడగానే అందులో విషయం అర్థం అయ్యేలా రాయాలి. రెజ్యూమ్ తయారు చేయాలనుకునే వారు కొన్ని ఫార్మాట్స్ చెక్ చేయాలి. వీటిని చూసి డాక్యుమెంట్‌ను ఎలా తయారు చేసుకోవచ్చు అనే దానిపై అవగాహన పెంచుకోవచ్చు.
రెజ్యూమ్‌లో రాయాల్సిన భాష గురించి పూర్తిగా తెలుసుకోవాలి. డాక్యుమెంట్‌లోని వివరాలు యాక్టివ్ టోన్‌లో ఉండాలి. ఏ విషయాన్ని అయినా స్పెసిఫిక్‌గా చెప్పాలి తప్ప జనరల్‌గా, పాసివ్‌గా చెప్పకూడదు. వర్క్ ఎక్స్‌పీరియన్స్ వివరాలు ఫ్యాక్ట్ బేస్డ్‌గా ఉండాలి తప్ప జనరల్‌గా ఎక్కడా రాయకూడదు.
రెజ్యూమ్ లో పర్సనల్ ప్రొనౌన్స్, స్లాంగ్ వర్స్డ్ రాయకపోవడమే మంచిది. ఏదో స్టోరీ రాసే శైలిలో రాయడం, దానిపై ఫొటో పెట్టడం, వయసు, ఇతర పర్సనల్ వివరాలు రాయకూడదు. గ్రమెటికల్‌గా, స్పెల్లింగుల్లో తప్పులు లేకుండా చూసుకోవాలి. ఇమెయిల్, అడ్రస్, ఫోన్ నంబర్స్ లాంటి ముఖ్యమైన సమాచారం మిస్ కాకూడదు. అలాగే రెజ్యూమ్ చాలా పెద్దగా, అనార్గనైజ్డ్‌గా ఉండకూడదు.
ఫాంట్‌లోనూ జాగ్రత్తలు..
రెజ్యూమ్ తప్పనిసరిగా కన్‌సిస్టెంట్ ఫార్మాట్లో ఉండాలి. లైన్లు ఒక దగ్గర పొడవుగా, ఒక దగ్గర పొట్టిగా, కుదించినట్లు లేకుండా చూసుకోవాలి. ఇటాలిక్‌లు, అండర్‌లైన్, క్యాపిటల్స్, ఫాంట్‌లు అవసరానికి తగినట్లు అన్ని చోట్లా ఒకేలా ఉండాలి. తగినంత మొత్తంలో ఖాళీ స్థలం(White space)తో ఆహ్లాదకరంగా కనిపించాలి. అవసరం, ప్రాముఖ్యతల్ని బట్టి హెడ్డింగులు, సైడ్ హెడ్డింగులు వాడాలి. సమాచారంలో ఇన్‌ఫర్మేషన్ గ్యాప్స్ లేకుండా జాగ్రత్త పడాలి.
* సరైన పదాలు వాడాల్సిందే
మనం దరఖాస్తు చేస్తున్న పోస్ట్‌కి సంబంధించి అదనంగా మనం చేసిన కోర్సులు ఏమైనా ఉంటే వాటిని తప్పనిసరిగా రెజ్యూమ్‌లో చేర్చాలి. వర్క్ ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించిన స్పెషల్ టర్మినాలజీ ఏమైనా ఉంటే, అక్కడ దాన్నే వాడాలి. దీంతో ఆ ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్ కలిగి ఉన్నారని అవి చెప్పకనే చెబుతాయి.
* కవర్ లెటర్ కోసం..
హర్వర్డ్ యూనివర్సిటీ సూచనల ప్రకారం.. కవర్ లెటర్‌లో పూర్తి వివరాలు రాయాలి. లెటర్ రాయడానికి గల కారణాన్ని స్పష్టంగా చెప్పడానికి మొదటి పేరాని ఉపయోగించండి. మొదటి పేరాలో మీరు ఉద్యోగానికి సరిపోతారని తెలిపే మూడు కారణాలను క్లుప్తంగా చెప్పడం మంచిది. మీరు అప్లై చేస్తున్న పోస్ట్‌ను కూడా దానిలో తప్పక రాయాలి.
రెండో పేరాలో మీరు ఆ పోస్టుపై ఎందుకు ఆసక్తి కలిగి ఉన్నారో రాయండి. దానికి సరిపోయేలా ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఉన్న విషయాన్ని చిన్నగా చర్చించండి. అప్లై చేస్తున్న పోస్టుకు సంబంధించిన పూర్తి స్కిల్స్ మీకు ఉన్నట్లు నమ్మకాన్ని కలిగించే విషయాలన్నింటినీ పేరాలో రాయండి.
ముగింపు పేరాలో ఈ జాబ్ కోసం మీ ఇంట్రస్ట్, మోటివేషన్ ఏంటో తెలపండి. ధన్యవాదాలతో ముగించండి. అయితే కవర్ లెటర్ ఒక పేజీకి మించకుండా ఉండాలి. ఇంకా అప్లై చేస్తున్న సంస్థ విధానాలకు అనుగుణంగా రాయాలన్నది మర్చిపోకండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Resume