పని చేయకపోతేనే శాలరీ... రూ.1.41 లక్షలు... ఈ జాబ్ కావాలంటే ట్రైచెయ్యండి

ఇలాంటి ఉద్యోగం కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోవడం సహజం. అదే ఈ ఉద్యోగం ప్రత్యేకత. రూ.1.41 లక్షలు వస్తాయి. పని మాత్రం చెయ్యకూడదు. చేస్తే శాలరీ ఇవ్వరు.

news18-telugu
Updated: August 24, 2020, 2:03 PM IST
పని చేయకపోతేనే శాలరీ... రూ.1.41 లక్షలు... ఈ జాబ్ కావాలంటే ట్రైచెయ్యండి
పని చేయకపోతేనే శాలరీ... రూ.1.41 లక్షలు... ఈ జాబ్ కావాలంటే ట్రైచెయ్యండి
  • Share this:
పైన మీరు చదివిన హెడ్డింగ్ వంద శాతం నిజం. ఈ ఉద్యోగం గురించి మొదటిసారి తెలుసుకునే ఎవరైనా సరే... "నిజమా... అలాంటి జాబ్ కూడా ఉందా?" అని అడుగుతారు. కానీ ఇలాంటి జాబ్‌ ఇప్పుడు ఏర్పడుతోంది. అక్కడ ఏ పనీ చేయకపోతేనే రూ.1.41 లక్షల జీతం ఇస్తారు. జర్మనీలో ఈ జాబ్ ఆఫర్ ఉంది. జర్మనీ యూనివర్శిటీ దగ్గరున్న ఓ ఇంగ్లీష్ మీడియా ఔట్‌లెట్... దరఖాస్తు దారులకు ఈ డబ్బును ఇస్తోంది. ఏ పనీ చేయకూడదనే కండీషన్ ఉంది. పని చేస్తే మాత్రం ఇవ్వరు. జర్మనీ... హ్యాంబర్గ్ దగ్గర ఉంది యూనివర్శిటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఈ యూనివర్సిటీ ఐడిల్‌నెస్ గ్రాంట్ (విశ్రాంతి నిధి)ని అప్లికేషన్ పెట్టుకున్నవారికి ఇవ్వాలనుకుంటోంది. 1800 యూరోలను ఖాళీగా, పనీ పాటా లేకుండా ఉన్నందుకు ఇవ్వాలనుకుంటోంది. మన రూపాయిల్లో అది రూ.1.41 లక్షలు.

ఈ ఉద్యోగం కావాలంటే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు అని అడుగుతారు. ఖాళీగా ఉండాలనుకుంటున్నాను అని చెబితే... ఎన్నాళ్లు ఇలా ఖాళీగా ఉండాలనుకుంటున్నారు అని అడుగుతారు. అలాగే... ఏ జాబూ చెయ్యకూడదని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని కూడా అడుగుతారు. వారికి సంతృప్తికర సమాధానం చెప్పారనిపిస్తే జాబ్ ఇస్తారు.

ఏ పనీ చేయనివారి ఆలోచనలు, ప్రవర్తన, సమాచారాన్ని ఈ యూనివర్శిటీ కలెక్ట్ చేయాలనుకుంటోంది. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 15లోపు అప్లికేషన్ పెట్టుకోమని కోరింది యూనివర్శిటీ.
Published by: Krishna Kumar N
First published: August 24, 2020, 2:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading