BODMAS: ఈ సమస్యను పరిష్కరించగలరా.. 8/2(2+2)=?.. డైలమాలో నెటిజన్లు..

BODMAS | PEMDAS | 8/2(2+2)= ఎంత? ఏముంది సమాధానం ‘1’ అని కొందరు అంటుంటే.. ఇంకొందరు కాదు.. దాని సమాధానం ‘16’ అని మరికొందరు వాదిస్తున్నారు. మరి ఇందులో ఏది నిజం?.. స్పష్టంగా చెప్పాలంటే రెండు సమాధానాలు సరైనవే.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 8, 2019, 3:26 PM IST
BODMAS: ఈ సమస్యను పరిష్కరించగలరా.. 8/2(2+2)=?.. డైలమాలో నెటిజన్లు..
ఈ సమస్యను పరిష్కరించండి..
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 8, 2019, 3:26 PM IST
బాడ్‌మాస్ థియరీ గుర్తుందా.. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం.. గణితం లెక్కలేగా.. ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? ఇప్పుడదే నెట్టింట్లో ట్రెండ్, హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఒక చిన్న సమస్యను పరిష్కరించడానికి తలలు పట్టుకుంటున్నారు. అదేంటంటే.. 8/2(2+2)= ఎంత? ఏముంది సమాధానం ‘1’ అని కొందరు అంటుంటే.. ఇంకొందరు కాదు.. దాని సమాధానం ‘16’ అని మరికొందరు వాదిస్తున్నారు. మరి ఇందులో ఏది నిజం?.. స్పష్టంగా చెప్పాలంటే రెండు సమాధానాలు సరైనవే. ఒక సమస్యకు రెండు సమాధానాలు ఉండటం అసాధ్యం కానీ ఇక్కడ సాధ్యమైంది. అసలు రెండు జవాబులు రానేరావు. మరి అవి ఎలా వచ్చాయి అంటే.. మనం నేర్చుకున్న BODMAS వల్లే.

ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల గణితవేత్తలు BODMAS థియరీ గురించి చెబితే, మరికొందరికి PEDMAS థియరీ గురించి చెప్పారు. BODMAS ప్రకారం బ్రాకెట్‌లో ఉన్న అంకెలను తొలుత లెక్కించి, తర్వాత విభాగం, గుణకారం, కూడిక చేసి చివరికి తీసివేత చేయాలి. PEMDAS ప్రకారం బ్రాకెట్‌లో ఉన్న అంకెలను తొలుత లెక్కించి, తర్వాత ఘాతాంకం(Exponent), గుణకార విభాగం(Multiplication Division) , కూడిక, తీసివేత చేయాలి. అదే ఇప్పుడు చిక్కుగా మారింది. BODMAS ప్రకారం జవాబు 1, PEMDAS ప్రకారం జవాబు 16 వస్తుంది.

BODMAS:

=> 8/2(2+2)=?


=> 8/2(4)
=> 8/8
1
Loading...
PEMDAS:
=> 8/2(2+2)=?
=> 8/2(4)
=> 4(4)
16


First published: August 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...