ప్రతిభగల విద్యార్థులకు పలు విద్యా సంస్థలు ఫీజులలో ఎంతోకొంత తగ్గింపులు ప్రకటిస్తుంటాయి. అయితే తాజాగా భారతీయ ఉన్నత విద్యా సంస్థ అయిన పెరల్ అకాడమీ (Pearl academy) మెరిట్ స్టూడెంట్స్‌కు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ విద్యా సంస్థ కొత్తగా ఓ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది.
ప్రతిభగల విద్యార్థులకు పలు విద్యా సంస్థలు ఫీజులలో ఎంతోకొంత తగ్గింపులు ప్రకటిస్తుంటాయి. అయితే తాజాగా భారతీయ ఉన్నత విద్యా సంస్థ అయిన పెరల్ అకాడమీ (Pearl academy) మెరిట్ స్టూడెంట్స్‌కు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ విద్యా సంస్థ కొత్తగా ఓ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ‘హూ ఇస్ నెక్స్ట్(Who's Next)’ అని పిలిచే ఈ ప్రోగ్రామ్ కింద ప్రతిభావంతులైన విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు 100 శాతం ఫీజు మినహాయింపు (100 percent fee waiver) అందిస్తామని పెరల్ అకాడమీ వెల్లడించింది. ఒక సెలక్షన్ టెస్ట్ (selection test) ఆధారంగా 100 మంది విద్యార్థులను ఈ స్కాలర్షిప్ కోసం ఎంపిక చేస్తామని తెలిపింది. ఫిబ్రవరి 2022 అడ్మిషన్ల కోసం ఫిబ్రవరి 6లోగా విద్యార్థులు స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పెరల్ అకాడమీ ఆన్లైన్ ప్రవేశ పరీక్ష (online entrance exam) ఫిబ్రవరి 12న జరుగుతుంది.
స్కాలర్షిప్ను పొందేందుకు అభ్యర్థులు... తమ స్కూల్/కాలేజీ/ పరిసరాలు/సమాజంలో తమ సృజనాత్మకతను ఉపయోగించి తాము పరిష్కరించిన సమస్య గురించి.. దాని గురించి తాము ఎందుకు గర్వపడుతున్నామో వివరించాల్సి ఉంటుంది. తమ గొప్ప క్రియేటివిటీ గురించి బాగా వివరించిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు అర్హత సాధిస్తారు. పెరల్ అకాడమీ ఢిల్లీ-సౌత్, ఢిల్లీ-వెస్ట్, జైపూర్, ముంబై, బెంగళూరులోని క్యాంపస్‌ల ద్వారా ఫ్యాషన్, డిజైన్, కాంటెంపరరీ మీడియా వంటి వాటిల్లో ప్రోగ్రామ్‌లను అందిస్తోంది.
పెరల్ అకాడమీ ప్రవేశ పరీక్ష ద్వారా అండర్-గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను స్క్రీనింగ్ చేస్తారు. వీరిలో 100 మంది మెరిటోరియస్ లేదా ప్రతిభగల దరఖాస్తుదారులను సెలక్షన్ క్రైటీరియా ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు విద్యార్థులు pearlacademy.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అలాగే స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేయడానికి ఫాలో కావాల్సిన స్టెప్ ఏవో చూద్దాం.
స్టెప్ 2. ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి. ఫారంను పూరించడానికి apply now బటన్‌పై క్లిక్ చేయండి. తర్వాత సబ్మిట్ చేయండి.
స్టెప్ 3. భవిష్యత్తు అవసరాల కోసం ఫారంను సేవ్ చేసి డౌన్లోడ్ చేయండి.
మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్‌లతో పాటు పెరల్ అకాడమీ మరిన్ని స్కాలర్‌షిప్‌లతో అందిస్తోంది. ప్రస్తుతం పెరల్ అకాడమీ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్, డీ స్కూల్ ఆఫ్ బిజినెస్ తన ప్రోగ్రామ్స్ కోసం 2022 విద్యా సంవత్సరానికి స్కాలర్షిప్లను ప్రకటించింది. డీ స్కూల్ ఆఫ్ బిజినెస్ AICTE ఆమోదించిన PGDM ప్రోగ్రామ్‌లను ఎంట్రప్రెన్యూర్షిప్, స్టార్ట్-అప్, ఫ్యామిలీ బిజినెస్, డిజిటల్ బిజినెస్, ఈ-కామర్స్, బిజినెస్ అనలిటిక్స్, డేటా సైన్స్ అండ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్ వంటి ప్రత్యేక రంగాలలో ఎంపిక చేసుకునే వెసులుబాటుతో అందిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి dschoolofbusiness.com వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.