ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 28గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అంటే మరో రెడు రోజుల్లో ఈ నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 132 పోస్టుల భర్తీ చేయనున్నారు. డిప్లొమా మరియు డిగ్రీ హోల్డర్ల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఖాళీగా ఉన్న డిప్లొమా ఇంజనీర్, డిగ్రీ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అధికారికి వెబ్ సైట్ pdilin.comని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, అర్హత తదితర వాటి కోసం ఇక్కడ తెలుసుకోండి.
మొత్తం పోస్టుల సంఖ్య.. 132
డిప్లొమా ఇంజనీర్ - 25 పోస్టులు
డిగ్రీ ఇంజనీర్ - 107 పోస్టులు
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ - జూలై 29
చేయడానికి చివరి తేదీ - ఆగస్టు 28
అర్హతలు..
అభ్యర్థులు ITI, డిప్లొమా/ డిగ్రీ (సంబంధిత ఇంజనీరింగ్ విభాగాలు), M.Sc, CA/ ICWA/ MBA (ఫైనాన్స్) కలిగి ఉండాలి.
దరఖాస్తు రుసుము..
జనరల్ & OBC కోసం: రూ.800/-
SC/ST/ EWS కోసం: రూ.400/-
చెల్లింపు విధానం: నెట్ బ్యాంకింగ్/డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/బ్యాంక్ బదిలీ ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు.
ఎంపిక విధానం..
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం ఇలా..
Step 1: ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేయండి.
Step 2: తర్వాత వెబ్ సైట్లో కెరీర్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. దీనిలో వివిధర రకాల ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించి వివరాలు ఉంటాయి.
Step 3: దీనిలో ADVT.NO. HR/71/22/02 అనే కాలమ్ లో Click Here to View అనే ఆప్షన్ ను ఎంచుకోండి.
Step 4: మరో వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. దీనిలో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Step 5: తర్వాత మీరు ఇచ్చిన ఈ మెయిల్ , మొబైల్ నంబర్ కు లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ వస్తుంది. దాని ద్వారా లాగ్ న్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ కొరకు డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేయండి.
Step 6: తగిన వివరాలను నమోదు చేసి.. ఉద్యోగ దరఖాస్తు ప్రక్రియను ముగించవచ్చు. చివరగా దరఖాస్తు ఫారమ్ ను ప్రింట్ తీసుకొని దగ్గర ఉంచుకోవాలి. భవిష్యత్ అవసరాల కొరకు ఇది ఉపయోగపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Central Government Jobs, Central jobs, JOBS