Paytm Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పీటీఎంలో భారీగా ఉద్యోగాలు.. నెలకు వేతనం రూ. 35 వేలు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

Paytm Jobs: పేటీఎంలో 20 వేల మంది అండర్ గ్రాడ్యుయేట్లను రూ .35,000 వేతనంతో నియమించుకోనుంది. కనీసం 18 సంవత్సరాలు నిండి 10, 12 లేదా గ్రాడ్యుయేట్ అయిన ఏ వ్యక్తి అయినా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీ కోసం ఒక శుభవార్త వస్తోంది. దేశంలోని అతిపెద్ద డిజిటల్ చెల్లింపు పరిష్కార సంస్థ పేటీఎం దీపావళికి ముందు రూ .16,600 కోట్ల ఐపీఓను తీసుకురాబోతోంది. ఇది ఇప్పటివరకు అతిపెద్ద ఐపిఓగా భావిస్తున్నారు. ఐపిఓ తీసుకురావడానికి ముందు కంపెనీ పూర్తిగా సన్నద్ధమవుతోంది. దీని కోసం, పేటీఎం ఇప్పుడు తన ఉద్యోగుల సంఖ్యను పెంచే ఆలోచనలో ఉంది.
    మొబైల్ ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలియని పదం పేటీఎమ. మొదట వాలెట్ గా మార్కెట్లోకి వచ్చి ప్రస్తుతం పేటీఎం పేమెంట్ బ్యాంకుతో పాటు మరెన్నో సౌకర్యాలను వినియోగదారుకుల అందిస్తోంది. అయితే వీటిలో దేశవ్యాప్తంగా 20 వేల ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవాలని నిర్ణయించింది. అండర్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి పేటీఎం తన ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ (ఎఫ్ఎస్ఈ) కార్యక్రమాన్ని ప్రారంభించింది. కనీసం 18 సంవత్సరాలు నిండి.. 10, 12 లేదా గ్రాడ్యుయేట్ అయిన ఏ వ్యక్తి అయినా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఆసక్తిగల వ్యక్తి Android స్మార్ట్‌ఫోన్ నుండి Paytm App ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చు. ద్విచక్ర వాహనాలు కలిగి ఉన్నవారికి, ప్రయాణానికి సౌకర్యవంతంగా మరియు ముందస్తు సేల్స్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దరఖాస్తుదారులకు స్థానిక భాష మరియు ప్రాంతంపై మంచి పరిజ్ఞానం ఉండాలి. మార్కెట్లో ప్రధాన పోటీ, త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు రానున్న సమయంలో పేటీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఉద్యోగుల ద్వారా పేటీఎం, క్యూఆర్ కోడ్, పీవోఎస్ మెషీన్, పేటీఎం సౌండ్ బాక్స్, వ్యాలెట్, యూపీఐ, పేటీఎం పోస్ట్ పెయిడ్, మర్చంట్ లోన్స్, ఇన్సూరెన్స్ స్కీంలను ప్రమోట్ చేయాలని భావిస్తోంది. దీని ద్వారా భారీ వ్యాపార విస్తరణకు కంపెనీ ప్లాన్‌ చేస్తోంది.

    Indian Navy SSC Recruitment 2021, Indian Navy Recruitment 2021, Indian Navy Jobs 2021, B tech jobs, Engineering jobs, Govt jobs 2021, ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ 2021, ఇండియన్ నేవీ జాబ్స్ 2021, ఇండియన్ నేవీ ఉద్యోగాలు 2021, బీటెక్ ఉద్యోగాలు, ఇంజనీరింగ్ ఉద్యోగాలు
    (ప్రతీకాత్మక చిత్రం)


    నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మే వరకు డేటా ప్రకారం ప్రస్తుత UPI మార్కెట్లో పేటీఎం కు 11 శాతం వాటా మాత్రమే ఉండగా.. 45 శాతం మార్కెట్ వాటాతో ఫోన్ పే మొదటి స్థానంలో, గూగుల్ పే 35 శాతం రెండో స్థానంలో ఉన్నాయి. ఫోన్ పే, గూగుల్ పే సహా పలు ఫిన్ టెక్ కంపెనీల పోటీని ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రిక్రూట్ చేయబడిన ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కమీషన్ రూపంలో నెలవారీ 35,000 మరియు అంతకంటే ఎక్కువ జీతం సంపాదించడానికి అవకాశం ఉంటుంది.
    Published by:Veera Babu
    First published: