Paytm Jobs : పేటీఎంలో 300 జాబ్స్.. పూర్తి వివరాలివే..

ప్రముఖ ఈకామర్స్ సంస్థ పేటీఎం ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల 200 ఉద్యోగాలు కల్పించిన ఈ సంస్థ.. రానున్న రోజుల్లో 300 మందికి అవకాశమివ్వనుంది.

Amala Ravula | news18-telugu
Updated: April 14, 2019, 6:35 PM IST
Paytm Jobs : పేటీఎంలో 300 జాబ్స్.. పూర్తి వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 14, 2019, 6:35 PM IST
దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఈకామర్స్ సంస్థ పేటీఎం ఉద్యోగావకాశాలుకల్పిస్తోంది. ఇప్పటికే వివిధ రంగాల్లో 200 మందిని నియమించిన ఈ సంస్థ.. రానున్న రోజుల్లో మరో 300మందికి అవకాశమివ్వనున్నారు. ఆన్‌లైన్ టూ ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా గత ఆరు నెలల్లో గణమైన వృద్ధి రేటు సాధించిన పేటీఎం తమ పరిధిని విస్తరింప జేయాలనుకుంటోంది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా వినియోగదారులకు చేరువగా మారుతూ బిజినెస్‌పరంగా దూకుడు ప్రదర్శించాలని చూస్తోంది. ఈ నేపత్యంలోనే మరింతగా ముందుకు దూసుకెళ్లాలని చూస్తోంది.
ఇదే విషయమై పేటీఎం మాల్ ఎస్వీపీ శ్రీనివాస్ మాట్లాడారు ‘ఆన్‌లైన్ టూ ఆఫ్‌లైన్ బిజినెస్‌ని మేము మరింతగా వృద్ధి చేయాలని భావిస్తున్నాం. అందుకోసం ఇప్పటికే 200మందిని ఉద్యోగావకాశాలు కల్పించాం.. అదే విధంగా.. త్వరలోనే మరో 300మందికి అవకాశాలు కల్పించనున్నాం’-శ్రీనివాస్
ఇప్పటికే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఎన్నో వస్తువులను అందుబాటులో ఉంచిన నేపథ్యంలో మరికొన్నింటిని చేర్చి తమ పరిధిని విస్తరింప జేయాలనుకుంటోంది పేటీఎం.

ఇవి కూడా చదవండి..

Jobs : మిధానిలో ఉద్యోగానికి అప్లై చేశారా.. చివరితేదీ దగ్గరికొచ్చేసింది..

First published: April 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...