Paytm: ఇక పేటీఎం నుంచి స్కూల్ అడ్మిషన్లు, స్కాలర్‌షిప్స్

Paytm Education | 20,000 ప్రైవేట్ స్కూళ్లు, 1,000 ఉన్నత విద్యా సంస్థలు, 1,000 కోచింగ్ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకొని 3.5 కోట్లమంది యూజర్లకు సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది పేటీఎం.

news18-telugu
Updated: July 9, 2019, 2:49 PM IST
Paytm: ఇక పేటీఎం నుంచి స్కూల్ అడ్మిషన్లు, స్కాలర్‌షిప్స్
Paytm: ఇక పేటీఎం నుంచి స్కూల్ అడ్మిషన్లు, స్కాలర్‌షిప్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
డిజిటల్ పేమెంట్ రంగంలో సంచలనాలు సృష్టించిన పేటీఎం... త్వరలో పేటీఎం ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ నుంచి విద్యారంగానికి సేవలు అందించనుంది. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో చేతులు కలుపుతోంది. అడ్మిషన్లు, పరీక్షా ఫలితాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు, కోచింగ్, టెస్ట్ ప్రిపరేషన్, విదేశీ విద్య, స్కిల్ డెవలప్‌మెంట్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ లాంటివాటికి పేటీఎం సేవలు అందించనుంది. అంతేకాదు... యూనిఫామ్ నుంచి పుస్తకాలు, స్టేషనరీ వరకు విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ అమ్మనుంది. దీంతోపాటు విద్యారుణాలు, బీమా, విద్యార్థులకు స్మార్ట్ కార్డ్స్ లాంటి ఆర్థిక సేవలు కూడా అందించనుంది. పేమెంట్స్, కామర్స్, ఫైనాన్షియల్ సేవలు అందిస్తున్న పేటీఎం... ఇప్పుడు విద్యారంగంపై దృష్టిపెట్టింది. దీని ద్వారా 20,000 ప్రైవేట్ స్కూళ్లు, 1,000 ఉన్నత విద్యా సంస్థలు, 1,000 కోచింగ్ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకొని 3.5 కోట్లమంది యూజర్లకు సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది పేటీఎం.

విద్యార్థులకు, తల్లిదండ్రులకు సేవలు అందించడమే మా లక్ష్యం. 25,000 కాలేజీలు, స్కూళ్లు, కోర్సులు, పరీక్షల సమాచారం అందించడం దగ్గర్నుంచి యాప్‌లో, విద్యా సంస్థల దగ్గర ఫీజులు చెల్లించడం, కోచింగ్, స్కాలర్‌షిప్, టెస్ట్ ప్రిపరేషన్, అడ్మిషన్ లాంటి సేవలు అందించడం వరకు మా సేవలుంటాయి. స్టూడెంట్ ఇన్స్యూరెన్స్, ఎడ్యుకేషనల్ లోన్ లాంటి సేవల్ని కూడా అందిస్తాం.
వినీత్ కౌల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, పేటీఎం


ఇప్పటికే 10,000 విద్యా సంస్థలకు ఫీజు పేమెంట్ సర్వీసెస్ అందిస్తోంది పేటీఎం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఇండియన్ నేవీ, ఎమిటీ, VIT, మణిపాల్, AKTU, ఆర్మీ పబ్లిక్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, AIMA, ICAI, నారాయణ గ్రూప్, కెరీర్ లాంఛర్, మేడ్ ఈజీ, Career360 లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది పేటీఎం.Asus 6Z: ఫ్లిప్ కెమెరాతో ఏసుస్ 6జెడ్... ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:Realme 3i: గుడ్ న్యూస్... జూలై 15న రియల్‌మీ 3ఐ రిలీజ్

SBI: ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్... రిజిస్టర్ చేసుకోండిలా

UPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే లావాదేవీల్లో ఈ జాగ్రత్తలు పాటించండి
First published: July 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>