నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సీఎస్ఈ(CSE), ఈఈఈ(EEE), ఎంబీఏ(MBA)లో 2021-22 విద్యా సంవత్సరానికి పార్ట్‌టైమ్(Part time) ఫ్యాకల్టీలను నియమించనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 27, 2021 వరకు అవకాశం ఉంది. మెరుగైన అకడామిక్(Academic) అర్హతలు ఉన్నవారికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్(Offline) ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక, తిరస్కరణ పూర్తిగా యూనివర్సిటీ(University)దే. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల పోస్టు(Post) ఆలస్యానికి యూనివర్సిటీది బ్యాధత ఉండదు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారికి నోటిఫికేషన్, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. పోస్టుల వివరాలు.. దరఖాస్తు విధానం తెలసుకోనేందుకు చదవండి.
అర్హతలు.. ఖాళీల వివరాలు
విభాగం | అర్హతలు | ఖాళీలు |
సీఎస్ఈ(CSE) | 55శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. పీహెచ్ డీ, ఎంఫీల్ చేసి ఉండాలి. అంతే కాకుండా నెట్(NET), ఎస్ఈటీ(SET), ఎస్ఎల్ఈటీ(SLET) పాసై ఉండాలి. | 03 |
ఈఈఈ(EEE) | 55శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. పీహెచ్ డీ, ఎంఫీల్ చేసి ఉండాలి. అంతే కాకుండా నెట్(NET), ఎస్ఈటీ(SET), ఎస్ఎల్ఈటీ(SLET) పాసై ఉండాలి. | 03 |
ఎంబీఏ(MBA | టూరిజం అండ్ ట్రావెల్/ మార్కెటింగ్/ హెచ్ ఆర్/ ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. | 03 |
NIT Agarthala: ఎన్ఐటీ అగర్తలాలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. అర్హతలు ఇవే
దరఖాస్తు.. ఎంపిక విధానం
- దరఖాస్తు చేసుకొనే వారు ముందుగా అధికారిక వెబ్సైట్ https://mguniversity.ac.in/home.php లో నోటిఫికేషన్‌ను చూడాలి (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
- ముందుగా నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. నోటిఫికేషన్ చివరిలో అప్లికేషన్ ఫాం ఉంటుంది.
- అప్లికేషన్ ఫాంను డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలతో నింపాలి.
- అనంతరం దాని పోస్టు ద్వారా మహాత్మాగాంధీ యూనివర్సిటీకి పంపాలి.
పంపాల్సిన చిరునామా..
The Registrar,
Mahatma Gandhi University,
Yellareddygudem,
NALGONDA- 508 254
- దరఖాస్తు చేరాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 27, 2021
- మీ దరఖాస్తు ఆలస్యంగా వెళ్తే యూనివర్సిటీ బాధ్యత ఉండదు కావున త్వరగా పోస్ట్ చేయండి
- దరఖాస్తు కోసం కొత్త పాస్‌పోర్టు ఫోటో ఉంచాలి. సంతకం(Signature) కచ్చితంగా చేయాలి. .
- సంతకం చేయని అప్లికేషన్(Application) ఫాం స్వీకరించరు.
- అప్లికేషన్ ఎన్వలప్‌పైన కచ్చితంగా మీరు దరఖాస్తు చేస్తున్నవిభాగం (సీఎస్సీ, ఈఈఈ, ఎంబీఏ) కచ్చితంగా రాయాలి.
- మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిబంధనల ప్రకారం పార్ట్‌టైం అధ్యాపకులకు వేతనం అందిస్తారు.
- ఈ ఎంపిక ప్రక్రియను ఎప్పుడైన నిలిపివేసే హక్కు యూనివర్సిటీకి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, Telangana govt