ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(The Employees’ State Insurance Corporation)కు చెందిన కలబురగిలో ఉన్న ESIC కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ESIC రిక్రూట్మెంట్ ద్వారా పార్ట్ టైమ్ టీచింగ్ ఫ్యాకల్టీ (గంటవారీ ప్రాతిపదికన) నింపడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్మెంట్లో అధ్యాపకుల(Teachers)ను పార్ట్‌టైం ప్రాతిపదికన నియమిస్తారు. ప్రస్తుతం ఈ విద్యాసంవత్సరానికి రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. సైకాలజీ, న్యూట్రిషన్, ఇంగ్లీష్(English0, కంప్యూటర్, కన్నడ మరియు సోషియాలజీతో సహా ఆరు సబ్జెక్టులకు పార్ట్ టైం అధ్యాపకులను నియమిస్తున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తులను నోటిఫికేషన్(Notification)లో చెప్పిన నిర్దేశిత ఫార్మాట్లో నింపాలి. నియామక వివరాలను అధికారిక ESIC వెబ్సైట్ చూడండి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అర్హతలు..
దరఖాస్తు చేసుకొనే అభ్యర్థికి సంబంధిత సబ్జెక్టు(Subjects)ల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత మరియు బోధనా అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అన్ని పోస్టులకు వయస్సు 66 సంవత్సరాలు మించకూడదు
థియరీ: గంటకు రూ.400
ప్రాక్టికల్: రూ. 200/ గంట
గమనిక: ఖాళీల సంఖ్య నియామక ప్రక్రియ ప్రారంభమై తరువాత పెరిగే అవకాశం, తగ్గే అవకాశం ఉంది
ఎంపిక విధానం
దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల విద్యార్హతతోపాటు అనుభవం ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు తిరస్కరించబడతాయి. తప్పు ప్రకటనలు/ తప్పుడు సమాచారాన్ని సమర్పించడం లేదా చట్టానికి విరుద్ధంగా ఏవైనా ఇతర చర్యలు ఏ దశలోనైనా అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని నోటిఫికేషన్లో తెలిపారు.
అప్లే చేసే విధానం..
అప్లికేషన్ ఫాం నింపి deanmc-gb.kar@esic.nic.in మెయిల్‌కి పంపాలి. మరింత సమాచారం కోసం అభ్యర్థులు డీన్, ESIC మెడికల్ కాలేజ్, కలబురగి ఫోన్-08471-265546 నంబర్‌ను కాంటాక్ట్ చేయోచ్చు. సప్రదించాల్సిన సమయం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో సంప్రదించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Government jobs, Teaching