Internship: డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్... రాజ్యసభలో ఇంటర్న్‌షిప్

Rajya Sabha Student Research and Study Scheme | డిగ్రీ చదువుతున్నారా? పీజీ పూర్తి చేశారా? భారత పార్లమెంట్‌లోని రాజ్యసభ గురించి అధ్యయనం చేసే మంచి అవకాశం లభిస్తోంది. రాజ్యసభ స్టూడెంట్ రీసెర్చ్ అండ్ స్టడీ స్కీమ్‌ గురించి తెలుసుకోండి.

news18-telugu
Updated: March 23, 2020, 12:35 PM IST
Internship: డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్... రాజ్యసభలో ఇంటర్న్‌షిప్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విద్యార్థులకు శుభవార్త. రాజ్యసభలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభిస్తోంది. రాజ్యసభ స్టూడెంట్ రీసెర్చ్ అండ్ స్టడీ స్కీమ్-RSRS కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది భారత పార్లమెంట్. ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు ఈ స్కీమ్‌కు అప్లై చేయొచ్చు. వేసవి సెలవుల్లో ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 మార్చి 31 చివరి తేదీ. నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టు ద్వారా లేదా rssei.rsrs@sansad.nic.in ఇమెయిల్ ఐడీకి దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు భారత పార్లమెంట్‌లోని రాజ్యసభ వ్యవహారాలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను https://rajyasabha.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో Rajya Sabha Research and Study (RSRS) Scheme లింక్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

Rajya Sabha Internship 2020: నోటిఫికేషన్ వివరాలివే...



మొత్తం ఇంటర్న్‌షిప్ ఖాళీలు- 10
గ్రాడ్యుయేట్స్- 5
పోస్ట్ గ్రాడ్యుయేట్స్- 5
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 31
విద్యార్హత- ఏదైనా డిగ్రీ లేదా పీజీ.స్టైపెండ్- నెలకు రూ.10,000
ఇంటర్న్‌షిప్ గడువు- 18 నెలలు
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Shri S. D. Nautiyal,
Joint Secretary,
Rajya Sabha Secretariat,
Room No. 517, 5th Floor,
Parliament House Annexe,
New Delhi - 110001

నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 404 జాబ్స్... వివరాలివే

Jobs: పీజీ పాసైనవారికి 150 జేఆర్ఎఫ్ పోస్టులు... వివరాలివే

Education Loan: ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారా? ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి
Published by: Santhosh Kumar S
First published: March 23, 2020, 12:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading