Pariksha Pe Charcha: సాధారణంగా పరీక్షల(Exams) సమయంలో చాలా మంది విద్యార్థులు ఒత్తిడి గురవుతుంటారు. దీంతో ప్రిపరేషన్‌పై పూర్తిగా దృష్టిసారించలేక ఇబ్బందులు పడుతుంటారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని ఎదుర్కొనేలా విద్యార్థులకు సూచనలు అందించేందుకు, ప్రోత్సహించేందుకు పరీక్షా పే చర్చా(PPC) కార్యక్రమాన్ని విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమం ఆరో ఎడిషన్ వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలోని టౌన్ హాల్లో జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడతారు. పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరిస్తారు.
ముందుగా ఆన్లైన్ క్రియేటివ్ కాంపిటీషన్
ఈ కార్యక్రమానికి ఎంపిక కావాలంటే.. విద్యార్థులు ముందుగా ఆన్లైన్ క్రియేటివ్ కాంపిటీషన్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ కాంపిటీషన్ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 30 వరకు జరుగుతుంది. 9వ తరగతి నుంచి 12 తరగతులకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ టోర్నమెంట్లో పాల్గొనవచ్చు. అర్హులైన వారు తప్పనిసరిగా తమ ఎంట్రీలను innovateindia.mygov.in/ppc-2023 వెబ్సైట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఈ కాంపిటీషన్ ద్వారా 2025 విజేతలను ప్రకటించనున్నారు. వీరు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ నుంచి సర్టిఫికేట్‌తో పాటు “ఎగ్జామ్ వారియర్” పుస్తక కాపీని అందుకొనే అవకాశం ఉంది. ఈ ప్రోగ్రామ్‌లో ఎన్సీఈఆర్టీ షార్ట్‌లిస్ట్ చేసిన కొన్ని ప్రశ్నలు ఉండవచ్చు. ఈ ప్రశ్నలను అడిగిన వారు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉండవచ్చు.
విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచే ప్రశ్నల సేకరణ
ప్రధాని మోదీ అడ్రస్ చేయాల్సిన ప్రశ్నలను రూపొందించడానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఈ ప్రోగ్రామ్ కోసం ఆహ్వానిస్తారు. అయితే ఎన్సీఈఆర్టీ ఫైనల్‌గా ప్రశ్నలను షార్ట్‌లిస్ట్ చేయనుంది. షార్ట్ లిస్ట్ అయిన ప్రశ్నలను ప్రోగ్రామ్‌లో ప్రదర్శించే అవకాశం ఉంది. గత PPC ఈవెంట్స్‌లో ప్రశ్నలు సంధించిన అభ్యర్థులను తమ ప్రోగ్రామ్‌లలో పాల్గొనాలని మీడియా అవుట్‌లెట్స్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎడిషన్‌లోనూ ఎంపిక చేసిన కొంతమందికి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రోగ్రామ్‌ను ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియా హ్యాండిల్స్, #PPC2023 అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాటు క్రియేటివ్ పద్ధతులను ఉపయోగించాలని విద్యార్థులను, స్కూల్స్‌ను కోరింది. అంతేకాకుండా పోస్టర్, మూవీస్, ఇతర మెటీరియల్స్ క్రియేట్ చేయాలని కూడా సూచించింది. ఈ గ్రూప్ నుంచి ఎంపికైన ఆర్ట్‌వర్క్, ఫిల్మ్స్‌ను మై గవర్నమెంట్ పోర్టల్‌లో ప్రదర్శించనున్నారు.
థీమ్స్ ఫర్ చిల్డ్రన్స్
నో యువర్ ఫ్రీడమ్ ఫైటర్స్, సేవ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్, మై లైఫ్, మై హెల్త్, ఆరోగ్యంగా ఉండడం ఎందుకు చాలా ముఖ్యం? మంచి ఆరోగ్యంతో ఉండాలంటే ఏం చేయాలి, మై స్టార్టప్ డ్రీమ్, STEM ఎడ్యుకేషన్/ ఎడ్యుకేషన్ విత్ ఔట్ బౌండరీస్, టాయ్స్ అండ్ గేమ్స్ ఫర్ లెర్నింగ్ ఇన్ స్కూల్స్ అంశాలను విద్యార్థుల కోసం ఎంపిక చేశారు.
GK Capsule: జీ జిన్‌పింగ్ భేటీ నుంచి ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ వరకు..ఈ వారం మేజర్ కరెంట్ అఫైర్స్ ఇవే..
థీమ్స్ ఫర్ టీచర్స్
అవర్ హెరిటేజ్, ఎనేబులింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ , ఎడ్యుకేషన్ ఫర్ స్కిల్లింగ్, లెస్సర్ కరికులర్ లోడ్ అండ్ నో ఫియర్ ఫర్ ఎగ్జామ్స్, ఫ్యూచర్ ఎడ్యుకేషనల్ ఛాలెంజెస్ అంశాలను ఉపాధ్యాయులకు కేటాయించారు.
థీమ్స్ ఫర్ పేరెంట్స్
మై చైల్డ్, మై టీచర్, అడల్ట్ ఎడ్యుకేషన్-మేకింగ్ ఎవ్రీవన్ లిటరేట్, లెర్నింగ్ అండ్ గ్రోయింగ్ టుగెదర్ వంటి విషయాలను విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంపిక చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, Pm modi