Home /News /jobs /

PARIKSHA PE CHARCHA 2022 PM MODI TO STUDENTS ASK YOURSELF IF YOU READ ONLINE OR JUST WATCH REELS GH VB

Pariksha Pe Charcha: ఆన్‌లైన్‌లో చదువుతున్నారా..? రీల్స్‌ చూస్తున్నారా..? విద్యార్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్న మోదీ..!

ప్రసంగిస్తున్న మోదీ

ప్రసంగిస్తున్న మోదీ

ప్రతి విద్యార్థిలో ఒక అసాధారణమైన ప్రతిభ ఉంటుందని, దాన్ని గుర్తించి ప్రోత్సహించడంలో తల్లిదండ్రులు, గురువులు విఫలమవుతున్నారని ప్రధాని మోదీ చెప్పారు. శుక్రవారం జరిగిన పరీక్ష పే చర్చ (Pariksha Pe Charcha) కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

ఇంకా చదవండి ...
ప్రతి విద్యార్థిలో ఒక అసాధారణమైన ప్రతిభ ఉంటుందని, దాన్ని గుర్తించి ప్రోత్సహించడంలో తల్లిదండ్రులు, గురువులు విఫలమవుతున్నారని ప్రధాని మోదీ చెప్పారు. శుక్రవారం జరిగిన పరీక్ష పే చర్చ (Pariksha Pe Charcha) కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు(Parents), గురువులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆన్‌లైన్‌లో(Online) చదువుకొంటున్న సమయంలో విద్యార్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలని.. నిజంగా చదువుతున్నారా? లేదా సోషల్‌ మీడియాలో(Social Media) రీల్స్‌(Social Media Reels) చూస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారా? అని ప్రశ్నించుకోవాలని చెప్పారు. ప్రతి విద్యార్థి జీవితంలో పరీక్షలు కీలకమైన మెట్టు అని అభిప్రాయపడ్డారు.

Explained: భారత్‌కు చమురుపై పెద్ద ఎత్తున డిస్కౌంట్ ఆఫర్ చేసిన రష్యా.. దీనివల్ల ప్రయోజనం ఏంటి..?


పరీక్షల నేపథ్యంలో ఒత్తిడి, భయం వంటి సమస్యల్ని అధిగమించేందుకు ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల కోసం ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నాలుగేళ్లుగా విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కరోనా కారణంగా గతేడాది వర్చువల్‌ విధానంలోనే కార్యక్రమం జరిగింది. ఈ ఏడాదికి సంబంధించి శుక్రవారం ఢిల్లీలోని తల్కటోరా స్టేడియం వేదికగా ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘పరీక్షలు మన జీవితంలో ఒక కీలకమైన మెట్టు . ఇక్కడ కూర్చున్న వారిలో మొదటిసారి పరీక్షలకు హాజరవుతున్న వారు ఎవరూ లేరు. విద్యాజీవితంలో ప్రతి ఒక్కరు ఆయా సందర్భాల్లో పరీక్షలకు హాజరవుతూనే ఉంటారు. పరీక్షలనేవి జీవితంలో ఓ కీలక మెట్టు లాంటివి.’ అని చెప్పారు.

గత రెండేళ్లలో ఆన్‌లైన్‌ తరగతులకు(Online Classes) హాజరైన విద్యార్థుల అనుభవాలు, పరీక్షల ఒత్తిడిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో చదువుతున్నప్పుడు తమను తాము ఆత్మపరిశీలన చేసుకోవాలని, నిజంగా చదువుతున్నారా? లేక సోషల్‌ మీడియాలో రీల్స్‌ చూస్తూ సమయాన్ని వృథా చేసుకొన్నారా? అనేది ప్రశ్నించుకోవాలని మోదీ చెప్పారు.

Pension Scheme: ఈ స్కీమ్‌లో ఈరోజు చేరితే నెలకు రూ.9,250పెన్షన్ ఇచ్చే పథకం

ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరిగిన పరీక్ష పే చర్చ కార్యక్రమంలో వేదిక వద్ద ప్రధాని మోదీ.. కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల నుంచి ప్రశ్నలను స్వీకరించారు. అలాగే దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వర్చువల్‌ విధానంలో పాల్గొన్న విద్యార్థుల ప్రశ్నలను రికార్డ్ చేశారు. అనంతరం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ..‘తల్లిదండ్రులు కొన్నిసార్లు తమ పిల్లల బలాన్ని, ఆసక్తులను నిశితంగా పరిశీలించడంలో విఫలమవుతారు. ప్రతి విద్యార్థికి ఓ అసాధారణమైన ప్రతిభ ఉంటుందని అందరూ అర్థం చేసుకోవాలి. దాన్ని గుర్తించడంలో చాలా సార్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విఫలమవుతున్నారు.’ అని చెప్పారు.

పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని నాలుగు సంవత్సరాలుగా కేంద్ర విద్యా శాఖ పరిధిలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం విజయవంతంగా నిర్వహిస్తోంది. మొదటి మూడు పర్యాయాలు ఈ కార్యక్రమం ఇంటరాక్టివ్ టౌన్-హాల్ విధానంలో ఢిల్లీలో జరిగాయి. నాలుగో విడత కార్యక్రమం గతేడాది ఏప్రిల్ 7వ తేదీన ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించారు.

ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..
ఏప్రిల్‌ 1న జరుగుతున్న పరీక్ష పే చర్చ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఇటీవల ఓ ట్వీట్‌ ద్వారా మోదీ చెప్పారు. పరీక్ష పే చర్చ కార్యక్రమానికి వస్తోన్న స్పందన అసాధారణమని, ఇప్పటికే లక్షల్లో ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా ఓ ట్వీట్‌ చేశారు. పరీక్షల నేపథ్యంలో ఒత్తిడి, భయం, ఇతర సమస్యలను అధిగమించేందుకు ప్రధాని మోదీ నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు చిట్కాలు, సలహాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు.
Published by:Veera Babu
First published:

Tags: Pariksha Pe Charcha, Pm modi

తదుపరి వార్తలు