సీబీఎస్ఈ పరీక్షలపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు..

కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు పరీక్సల కోసం బయటకు వస్తే వారు వైరస్ బారిన పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా 15వేల కేంద్రాల్లో వాయిదా పడిన సీబీఎస్ఈ పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: June 10, 2020, 2:58 PM IST
సీబీఎస్ఈ పరీక్షలపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు..
సుప్రీంకోర్టు
  • Share this:
కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే పూర్తి కావాల్సిన పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఇప్పటికే ఆయా పరీక్షల ఫలితాలను ప్రకటించాలి. కానీ ఇంతవరకు అసలు పరీక్షలే నిర్వహించని పరిస్థితి. తాజాగా వాయిదా పడిన సీబీఎస్ఈ పరీక్షలపై విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీ కోర్టును ఆశ్రయించారు. ఇప్పట్లో సీబీఎస్ఈ పరీక్షలను నిర్వహించొద్దని, విద్యార్థుల అంతర్గత మదింపుతో వారి పనితీరు ఆధారంగా విద్యార్థులకు మార్కులు ఇవ్వాలని బోర్డును ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు. ఇదిలావుంటే.. జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా 15వేల కేంద్రాల్లో వాయిదా పడిన సీబీఎస్ఈ పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు పరీక్సల కోసం బయటకు వస్తే వారు వైరస్ బారిన పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

విద్యార్థులకు పరీక్షలను నిర్వహించొద్దంటూ ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటీ సంస్థల పిటిషన్లను చూపింది. దీనికితోడు ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల వెంట పరీక్ష రాసేందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపారు. దానివల్ల భౌతికదూరం పాటించడం కష్టమవుతుందని తల్లిదండ్రులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలావుంటే.. తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు సంబంధించి పరీక్షలను పూర్తిగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. పరీక్షలకు బదులుగా అంతర్గత మదింపు ద్వారా గ్రేడ్ సిస్థమ్‌ను అమలు చేస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: June 10, 2020, 2:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading