వారు కోరినందుకే NEET, JEE నిర్వహణ.. కేంద్ర విద్యాశాఖ ప్రకటన

పరీక్షలు నిర్వహించాలని తల్లిదండ్రులు తమపై అదే రకంగా ఒత్తిడి పెంచుతున్నారని.. జేఈఈ, నీట్ ఎందుకు నిర్వహించడం లేదని నిలదీస్తున్నారని ఆయన తెలిపారు.

news18-telugu
Updated: August 26, 2020, 12:51 PM IST
వారు కోరినందుకే NEET, JEE నిర్వహణ.. కేంద్ర విద్యాశాఖ ప్రకటన
రమేశ్ పొఖ్రియాల్
  • Share this:
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో జేఈఈ, నీట్ పరీక్ష నిర్వహణపై దుమారం రేగుతోంది. కోవిడ్ విజృంభిస్తున్న వేళ పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాటవొద్దని కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ క్లారిటీ ఇచ్చారు. పరీక్షల నిర్వహణను సమర్థించుకున్న ఆయన.. తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి తమపై తీవ్ర ఒత్తిడి ఉన్నదని, వారి కోరిక మేరకు జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పరీక్షకు సంబంధించి ఇప్పటికే 80 శాతం మంది విద్యార్థులు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు. మంగళవారం రాత్రి దూరదర్శన్ చానల్ నిర్వహించిన ఇంటర్వూలో ఆయన ఈ మేరకు వెల్లడించారు రమేష్ పొఖ్రియాల్.

పరీక్షలు నిర్వహించాలని తల్లిదండ్రులు తమపై ఒత్తిడి పెంచుతున్నారని.. జేఈఈ, నీట్ ఎందుకు నిర్వహించడం లేదని నిలదీస్తున్నారని ఆయన తెలిపారు. విద్యార్థులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారని.. ఈ పరీక్షలకోసం ఇంకా ఎన్ని రోజులు చదవాలనే భావన వారిలో నాటుకపోయిందని పొఖ్రియాల్ చెప్పారు. ఈ నేపథ్యంలో పరీక్షలను నిర్వహించక తప్పడం లేదని స్పష్టం చేశారు విద్యాశాఖ మంత్రి.

పరీక్షల నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారమే జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ, సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించింది. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను పెంపుతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాలను 570 నుంచి 660కి, నీట్ కేంద్రాలను 2546 నుంచి 3843కి పెంచారు. షిఫ్ట్‌ల సంఖ్యను కూడా 8 నుంచి 12 పెంచి.. ఒక్కో షిఫ్ట్‌కు పరీక్ష రాసే వారి సంఖ్యను తగ్గించారు. ఒక్కో షిఫ్ట్‌కు పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యను 1.32 లక్షల నుంచి 85వేలకు తగ్గించారు. కాగా, దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు 8.58 లక్షల మంది విద్యార్థులు, నీట్‌కు 15.97 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: August 26, 2020, 12:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading