PARENTS SOMETIMES FAIL TO CLOSELY OBSERVE THE STRENGTH AND INTERESTS OF THEIR CHILDREN SAYS PM MODI SB
Pariksha Pe Charcha: పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటారు.. 'పరీక్ష పే చర్చ' లో ప్రధాని మోదీ
ప్రతీ విద్యార్థిలో ఓ బలం ఉంటుందన్నారు. ఆన్ లైన్లో చదువుతున్నప్పుడు నిజంగా మనం చదువుతున్నామా లేదా అన్న విషయాన్ని విద్యార్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు మోదీ.
ప్రతీ విద్యార్థిలో ఓ బలం ఉంటుందన్నారు. ఆన్ లైన్లో చదువుతున్నప్పుడు నిజంగా మనం చదువుతున్నామా లేదా అన్న విషయాన్ని విద్యార్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు మోదీ.
పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. పరీక్షల సమయంలో విద్యార్థులు భయాందోళనలకు దూరంగా ఉండాలని తాను కోరుకుంటున్నాన్నారు.స్నేహితులను కాపీ చేయాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి విశ్వాసంతో కృషి చేయాలన్నారు. పండుగ మూడ్లో కూడా విద్యార్థులంతా తమ పరీక్షలను నిర్వహించగలరని తాను నమ్ముతున్నానన్నారు. 'పరీక్ష పే చర్చ' ఐదవ ఎడిషన్ సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో ఉదయం 11 గంటలకు ప్రసంగించారు.
మొదటి సారి పరీక్షలకు హాజరయ్యే వారెవరూ ఇక్కడ కూర్చోలేదన్నారు ప్రధాని. పలు విరామాల తర్వాత పదేపదే పరీక్షలకు కూర్చోవడం ద్వారా మనం పరీక్షల్ని పాస్ అవుతూ వస్తున్నామన్నారు. పరీక్షలు మన జీవితంలో ఒక మెట్టు లాంటివన్నారు ప్రధాని. ఆఫ్లైన్లో ఏది జరిగుతుందో అదే ఆన్లైన్లో కూడా జరుగుతుందన్నారు. మీడియం అనేది సమస్య కాదు. మీడియంతో సంబంధం లేకుండా, మన మనస్సును సబ్జెక్ట్ పై పెడితే.. మనం చాలా సులభంగా వాటిని అర్థం చేసుకోవచ్చన్నారు మోదీ. ఆన్లైన్ విద్య జ్ఞానాన్ని పొందే సూత్రంపై ఆధారపడి ఉంటుంది, అయితే ఆఫ్లైన్ విద్యలో ఆ జ్ఞానాన్ని కొనసాగించడం, వాటిని ఆచరణలో పెట్టడం లాంటివి చేయాన్నారు. విద్యార్థులు ఆన్లైన్లో చదువుతున్నప్పుడు తమను తాము ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. వారు నిజంగా చదువుతున్నారా లేదా సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ గడిపారా అనేది వారికి వారే చెక్ చేసుకోవాలన్నారు ప్రధాని.
Students should not feel they are under pressure from teachers and parents to score good marks. Parents should not inject their dreams into children. They should be allowed to decide their future freely: PM Modi during the fifth edition of 'Pariksha Pe Charcha' pic.twitter.com/OReWiEED6o
తల్లిదండ్రులు కొన్నిసార్లు తమ పిల్లల బలాన్న, వారి ఆసక్తిని గుర్తించడంలో ఫెయిల్ అవుతుంటారన్నారు ప్రధాని. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చాలాసార్లు విద్యార్థులకు ఏ విషయంలో ఆసక్తి ఉందో కనుగొనడంలో విఫలమవుతుంటారన్నారు. అయితే ప్రతీ పిల్లాడిలో ఏదో ఒక బలం దాగి ఉంటుందని తెలిపారు ప్రధాని. వాటిని మనం అర్థం చేసుకోవాలన్నారు. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో
ప్రధాని మోదీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నేరుగా సంభాషించి.. సలహాలు సూచనలు ఇచ్చారు ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో వేయి మంది విద్యార్థులు, వారి తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.