Home /News /jobs /

PARENTS OF SSC STUNDENTS DEMANDED MSBSHSE TO RETURN EXAMINATION FEE HERE THE FULL DETAILS GH SRD

SSC Exams : పదో తరగతి పరీక్ష ఫీజులను తిరిగి చెల్లించాల్సిందే..తల్లిదండ్రుల డిమాండ్..

SSC Exams : పదో తరగతి పరీక్ష ఫీజులను తిరిగి చెల్లించాల్సిందే..తల్లిదండ్రుల డిమాండ్..

SSC Exams : పదో తరగతి పరీక్ష ఫీజులను తిరిగి చెల్లించాల్సిందే..తల్లిదండ్రుల డిమాండ్..

SSC Exams : ప్రశ్న పత్రాలు తయారు చేయడానికి, వాటిని ముద్రించడానికి, జవాబు పత్రాలకు, ఇతర స్టేషనరీ కోసం విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజులు వసూలు చేస్తారు. అయితే, మా ఫీజలు మాకు తిరిగి ఇవ్వాల్సిందిగా తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎక్కడంటే..

ఇంకా చదవండి ...
కరోనా కారణంగా ప్రస్తుత విద్యా సంవత్సరం అర్ధాంతరంగా ముగిసింది. ఈ సంవత్సరం కూడా చాలా రాష్ట్రాలు పాఠశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేస్తున్నట్టు ప్రకటించాయి. పదో తరగతి బోర్డు పరీక్షలను కూడా వివిధ రాష్ట్రాలు, కేంద్ర ఎడ్యుకేషన్ బోర్డులు రద్దు చేశాయి. ఈ నేపథ్యంలో తాము చెల్లించిన పరీక్ష ఫీజులను తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు మహారాష్ట్రకు చెందిన పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు. ఈ సంవత్సరం పరీక్షలు లేనందున తాము చెల్లించిన పరీక్ష ఫీజును రిఫండ్ చేయాలని మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ సర్టిఫికెట్ (MSBSHSE) సంస్థను కోరుతున్నారు. పరీక్ష ఫీజుగా వసూలు చేసిన రూ.500 తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తామని ప్రకటించిన మహారాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డు, కరోనా ప్రభావం కారణంగా వాటిని రద్దు చేసింది. అందువల్ల తమ నుంచి వసూలు చేసిన పరీక్ష ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రూ.500 చాలా చిన్న మొత్తం అయినప్పటికీ, కొన్ని కుటుంబాలకు మాత్రం ఇది చాలా పెద్ద మొత్తమని కొందరు వాదిస్తున్నారు.

మహారాష్ట్రలో ఈ సంవత్సరం మొత్తం 16,00,249 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫీజులు చెల్లించారని MSBSHSE వెల్లడించింది. ఈ సంవత్సరానికి బోర్డు వసూలు చేసిన పరీక్ష ఫీజుల నిధులు రూ.80 కోట్లకు చేరాయి. కోవిడ్ ఉద్ధృతితో పరీక్షలను బోర్డు రద్దు చేసింది. అయితే అంతకు ముందు మాత్రం విద్యార్థులకు ఆఫ్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని బోర్డు భావించింది. ఇందుకు విద్యార్థుల నుంచి రూ.500 పరీక్ష ఫీజు వసూలు చేసింది. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినందువల్ల, వసూలు చేసిన నిధుల్లో కొంత డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.

ప్రశ్న పత్రాలు తయారు చేయడానికి, వాటిని ముద్రించడానికి, జవాబు పత్రాలకు, ఇతర స్టేషనరీ కోసం విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజులు వసూలు చేస్తారు. మహారాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డు ఆఫ్‌లైన్ విధానంలో పరీక్షలకు ఏర్పాట్లు చేసింది. అందువల్ల వసూలైన నిధుల్లో పావు వంతు ఖర్చయ్యే అవకాశం ఉందని కొందరు విద్యారంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బోర్డు ఇప్పటికే పత్రాలను ముద్రించిందని పుణె జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు హరిశ్చంద్ర గైక్వాడ్ తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు గ్రేడులను ఎలా అంచనా వేస్తారనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోనందువల్ల, బోర్డు ఫీజును తిరిగి చెల్లించడానికి సమయం పట్టవచ్చని చెప్పారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయడం ఇదే మొదటిసారి. అందువల్ల వసూలు చేసిన ఫీజుల విషయంలో నిర్ణయం తీసుకోవడం ఆలస్యమవుతోందని గైక్వాడ్ వివరించారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Corona, Maharashtra, Ssc exams

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు