హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

LKG Admissions: LKG సీట్ల కోసం తెల్లవారుజామున 3 గంటల నుంచి క్యూ.. చలిలో వణుకుతూ కూడా ఇలా..

LKG Admissions: LKG సీట్ల కోసం తెల్లవారుజామున 3 గంటల నుంచి క్యూ.. చలిలో వణుకుతూ కూడా ఇలా..

LKG Admissions: LKG సీట్ల కోసం తెల్లవారుజామున 3 గంటల నుంచి క్యూ.. చలిలో వణుకుతూ కూడా ఇలా..

LKG Admissions: LKG సీట్ల కోసం తెల్లవారుజామున 3 గంటల నుంచి క్యూ.. చలిలో వణుకుతూ కూడా ఇలా..

ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సీట్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. సిటీలో పేరున్న పాఠశాలల్లో ఫీజు ఎక్కువగా ఉన్నా.. చాలా మంది తల్లిదండ్రలు క్వాలిటీ ఎడ్యూకేషన్ కొరకు ఆ స్కూళ్లకే పంపిస్తుంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ప్రైవేట్ పాఠశాలల్లో(Private School) ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సీట్లకు ఎక్కువగా డిమాండ్(Demand) ఉంటుంది. సిటీలో పేరున్న పాఠశాలల్లో ఫీజు ఎక్కువగా ఉన్నా.. చాలా మంది తల్లిదండ్రలు క్వాలిటీ ఎడ్యూకేషన్(Quality Education) కొరకు ఆ స్కూళ్లకే పంపిస్తుంటారు. అయితే స్కూళ్ల వద్ద క్యూలో నిలబడి అడ్మిషన్స్ తీసుకోవడం అనేది చాలా అరుదు. అది కూడా 1-10 తరగతులకు మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మనం చెప్పే స్కూల్(School) వద్ద LKG సీట్ల కోసం తల్లిదండ్రులు బారులు తీరారు. అది కూడా ఉదయం 3 గంటల నుంచి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సాధారణంగా పిల్లల అడ్మిషన్ కొరకు తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లి..పాఠశాల యాజమాన్యంతో ఫీజు విషయం మాట్లాడి అడ్మిషన్ తీసుకుంటారు. కానీ హైదరాబాద్ పేట్ బషీరాబాద్ లోని St. Ann’s School వద్ద తమ పిల్లల LKG సీట్ల కోసం ఉదయం 3 గంటల నుంచి క్యూ కట్టారు. అసలే చలికాలం.. ఎముకలు కొరికే అంత చలిలో కూడా వాళ్లు క్యూలో నిల్చున్నారు. చలికి సైతం లెక్కచేయకుండా.. తమ పిల్లల అడ్మిషన్స్ కోసం ఇలా బారులు తీరడంతో.. నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎల్కేజీ చదువుకే ఇంత డిమాండ్ ఉంటే.. ఇక పై చదువులకు తమ పిల్లలను చదివించాలంటే.. ఇక్కడ అడ్మిషన్ దొరకడం కష్టమే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. నాణ్యమైన విద్య అనేది కేవలం ప్రైవేట్ కళశాలలోనే కాదు ప్రభుత్వ పాఠశాల్లో కూడా ఉంటున్నాయి. ఒకప్పుడు పిల్లలు ఉన్న చోట టీచర్లు ఉండరు. ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు కనిపించే వారు కాదు. కానీ ప్రస్తుతం ఆ సీన్ అంతా మారిపోయింది. ఏ ప్రభుత్వ పాఠశాల చూసిన విద్యార్థులతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. అందుకు కారణం అక్కడ పనిచేసే టీచర్ల చిత్తశుద్ధి, అంకితభావం. సర్కారీ స్కూళ్లు కూడా ఏ ప్రైవేట్ పాఠశాలకు తీసిపోకుండా.. మౌలిక సదుపాయాల కల్పన నుంచి విద్యాబోధన వరకు అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం చొరవ తీసుకోంటోంది. ఇలా ఇబ్బందుకు పడుకుంటూ.. LKG విద్య కోసం క్యూలో నిల్చోవడం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మంచి విద్యను అందిస్తున్నారంటూ నెటిజన్ల పేర్కొంటున్నారు.

CAT: క్యాట్‌ ఎగ్జామ్‌లో బెస్ట్ స్కోర్ మీ టార్గెటా..? క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీడింగ్ ప్రిపరేషన్ ఇలా..

ఏదేమైనా ఇలా తెల్లవారు జామున 3 గంటల నుంచి తమ పిల్లల అడ్మిషన్ కోసం క్యూలో నిల్చోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. అయితే ఇక్కడ పాఠశాల యాజమాన్యం కనీస సౌకర్యాలు కల్పించకపోగా ఇష్టానుసారంగా సీట్లు కేటాయిస్తున్నారని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీట్ల కేటాయింపులో అందరికీ న్యాయం చేయాలంటూ పాఠశాల యాజమాన్యాన్ని తల్లిదండ్రులు కోరుతున్నారు.

First published:

Tags: Career and Courses, JOBS, Viral, Viral Videos

ఉత్తమ కథలు