Palamuru University Recruitment 2021 | మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ (Palamuru University) పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ (Part Time Faculty) పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో రోజు మాత్రమే గడువుంది. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.
ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి శుభవార్త. పాలమూరు యూనివర్సిటీ (Palamuru University) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటీస్ విడుదల చేసింది. పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ (Part Time Faculty) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పీజీ కాలేజ్-మహబూబ్‌నగర్, పీజీ సెంటర్-జోగులాంబ గద్వాల, పీజీ సెంటర్-వనపర్తి, పీజీ సెంటర్-కొల్హాపూర్‌లో ఈ పోస్టులున్నాయి. పోస్టుల సంఖ్యను పాలమూరు యూనివర్సిటీ వెల్లడించలేదు. కేవలం టెంపరరీ పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. 2021-22 విద్యా సంవత్సరానికి మాత్రమే ఈ పోస్టుల్ని ప్రకటించింది. ఆసక్తి గల అభ్యర్థులు పాలమూరు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు దరఖాస్తు ఫామ్ పంపాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.