రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (Railway Recruitment Board) పెద్ద ఎత్తున ప్రకటించిన 1,03,769 గ్రూప్ డీ పోస్టుల భర్తీ ప్రక్రియ నత్త నడకన సాగుతోంది. 2019లో ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేయగా ఈ రైల్వే ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా దాదాపు కోటి మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే, నోటిఫికేషన్ విడుదలై దాదాపు రెండున్నరేళ్లు కావొస్తున్నా ఇప్పటివరకు దీనికి సంబంధించి పరీక్షలు ప్రారంభం కాకపోవడం గమనార్హం. ఆర్ఆర్బీ గ్రూప్ డీ పరీక్షల (RRB Group D Exam) ఆలస్యంపై 2020 డిసెంబర్లో రైల్వే రిక్రూట్ బోర్డ్ స్పందిస్తూ.. ‘‘తొలుత ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తాం. ఈ టెస్ట్‌ను దేశవ్యాప్తంగా మొత్తం 7 ఫేజ్‌లలో నిర్వహిస్తాం. ఈ పరీక్ష పూర్తయిన వెంటనే RRC గ్రూప్ డీ పరీక్ష ప్రారంభమవుతుంది.”అని తెలిపింది.
జూలైలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ (RRB NTPC Exam) మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పూర్తయ్యింది. దేశవ్యాప్తంగా మొత్తం 7 ఫేజ్‌లలో ఈ పరీక్షలను నిర్వహించారు. కరోనా కారణంగా పరీక్షల నిర్వహణ ఆలస్యమైనప్పటికీ.. ఎట్టకేలకు వీటిని పూర్తి చేశారు. అయితే, రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ గతంలో చెప్పినట్లు.. గ్రూప్‌డీ పరీక్షల షెడ్యూల్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. దీనిపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ సమస్యను లేవనెత్తుతున్నారు. వెంటనే పరీక్ష తేదీలను వెల్లడించాలని ఆర్ఆర్బీకి విజ్ఞప్తి చేస్తున్నారు.
UIDAI Recruitment 2021: ఆధార్ సంస్థలో జాబ్స్... ఎలా అప్లై చేయాలంటే
కాగా, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షలకు దేశవ్యాప్తంగా 1.2 కోట్లకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షను నిర్వహించడానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులకు దాదాపు 7 నెలలకు పైగా సమయం పట్టింది. కోవిడ్–19 రెండవ వేవ్ విజృంభన కారణంగా ఏప్రిల్, -జూన్‌లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. కరోనా పరిస్థితి తగ్గుముఖం పట్టడంతో జులై నెలలో అన్ని ఫేజ్లను పూర్తి చేశారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ చివరి ఫేజ్ పరీక్ష జూలై 31న జరిగింది. దీంతో, దేశవ్యాప్తంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రక్రియ పూర్తయ్యింది.
అయితే, ఈ పరీక్ష పూర్తయ్యి నెల రోజులు గడుస్తున్నా గ్రూప్ డీ పరీక్షలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. పరీక్ష షెడ్యూల్ కోసం అభ్యర్థులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వెంటనే పరీక్ష తేదీలు ప్రకటించాల్సిందిగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తులు చేస్తున్నారు. పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసి నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సోషల్‌మీడియా వేదికగా కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Govt Jobs 2021, Indian Railway, Indian Railways, Job notification, JOBS, Railway Apprenticeship, Railway jobs