Dropouts: ప్రస్తుత ఆధునిక కాలంలో కూడా వివిధ వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యకు(Education) దూరమవుతున్నారు. ఆర్థిక, సామాజిక పరిస్థితులు లేదా ఇతర విషయాలు అందుకు కారణం కావచ్చు. ఇక ఉన్నత విద్యకు(Higher education) దూరమవుతున్న విద్యార్థుల సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరుగుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ పార్లమెంట్‌లో వెల్లడించింది. 2018-2023 మధ్య కాలంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన దాదాపు 19,000కు పైగా విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారని తెలిపింది.
రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉన్నత విద్యపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్(Subhas sarkar) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర విద్యాశాఖ డేటా ప్రకారం.. సెంట్రల్ యూనివర్సిటీలు(CUs), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITs), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIMs)లలో 2018 నుంచి 2023 వరకు వివిధ కోర్సుల్లో డ్రాపవుట్ అయిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల సంఖ్య 19,256గా ఉంది.
* సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎక్కువ ట్రాప్‌ఔట్స్
ఈ మూడు కేటగిరీలకు చెందిన విద్యార్థుల్లో ఎక్కువ మంది సెంట్రల్ యూనివర్సిటీల నుంచి డ్రాపవుట్ అయ్యారు. సీయూల నుంచి ఏకంగా14,446 మంది విద్యార్థులు చదువుకు స్వస్తి చెప్పారు. తరువాతి స్థానంలో ఐఐటీలు నిలిచాయి. ఈ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి 4,444 మంది విద్యార్థులు డ్రాపవుట్ కాగా, ఐఐఎంల నుంచి 366 మంది విద్యార్థులు తప్పుకున్నారు.
CUET 2023 Model Paper: సీయూఈటీ అభ్యర్థులకు అలర్ట్.. మాథ్స్ మోడల్ పేపర్ ఇదే.. ఓ లుక్కేయండి
* ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
పేద విద్యార్థులు ఉన్నత విద్యలో తమ కలలను సాకారం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. ప్రధానంగా ఫీజు తగ్గింపు, కొత్త ఇన్‌స్టిట్యూట్‌ల ఏర్పాటు, రాష్ట్ర, జాతీయ స్థాయిలో స్కాలర్‌షిప్స్ మంజూరు చేయడం వంటి చర్యలు చేపడుతోందన్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమం కోసం ఐఐటీల్లో ట్యూషన్ ఫీజు మాఫీ, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కింద జాతీయ స్కాలర్‌షిప్‌ల మంజూరు, ఇన్‌స్టిట్యూట్‌లలో స్కాలర్‌షిప్స్ వంటి పథకాలు కూడా ఉన్నాయని తెలిపారు.
* ఉన్నత విద్యలో మల్టిపుల్ ఆప్షన్స్
రాజ్యసభలో సర్కార్ మాట్లాడుతూ.. ఉన్నత విద్యకు సంబంధించి విద్యార్థులకు అనేక ఆప్షన్స్ ఉన్నాయన్నారు. ఒకే ఇన్‌స్టిట్యూట్‌లో ఒక కోర్సు నుంచి మరో కోర్సులో జాయిన్ కావచ్చు. లేదా ఇతర ఇన్ స్టిట్యూట్‌లలో చేరవచ్చు. ప్రధానంగా విద్యార్థులు తమకు నచ్చిన ఇతర డిపార్ట్‌మెంట్స్ లేదా ఇతర ఇన్‌స్టిట్యూషన్‌లలో అడ్మిషన్ పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి.’’ అని సర్కార్ వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Higher education, JOBS, Students