హాస్టల్స్ ఖాళీ చేయండి.. ఓయూ విద్యార్థులకు వీసీ ఆదేశాలు..

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు సెలవులు ఇచ్చేసింది. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓయూ స్పష్టం చేసింది.

news18-telugu
Updated: March 17, 2020, 7:45 AM IST
హాస్టల్స్ ఖాళీ చేయండి.. ఓయూ విద్యార్థులకు వీసీ ఆదేశాలు..
ఉస్మానియా యూనివర్సిటీ
  • Share this:
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రద్దీ ప్రదేశాల్లో తిరగవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. సినిమా హాళ్లు, పర్యాటక ప్రదేశాలు, రెస్టారెంట్లు, బార్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. అటు.. కొన్ని పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. విద్యార్థులకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటిస్తూ పలు యూనివర్సిటీలు నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా, ఉస్మానియా యూనివర్సిటీ కూడా విద్యార్థులకు సెలవులు ఇచ్చేసింది. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓయూ స్పష్టం చేసింది. తాజాగా, హాస్టల్స్ కూడా ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏ ఒక్కరు కూడా హాస్టల్‌లో ఉండటానికి వీలు లేదని, వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది. నేటి నుంచి కరెంట్, వాటర్ సప్లై ఆపేస్తామని స్పష్టం చేసింది.
ఓయూ ప్రకటన


అటు.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మాత్రం విద్యార్థులు వసతి గృహాల్లో ఉండేందుకు అనుమతి ఇచ్చింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి చదువుకోవడానికి వచ్చినందుకు ఉన్నఫలంగా వాళ్లను ఖాళీ చేయాలని కోరితే ఇబ్బంది పడతారని కొన్ని నిబంధనలతో అనుమతి ఇచ్చారు.
First published: March 17, 2020, 7:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading