విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల ఫలితాలు ప్రకటించిన ఓయూ..

తాజాగా లాక్‌డౌన్ నిబంధనల్లో కొంతమేర సడలింపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగం బీఈడీకి సంబంధించిన ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది.

news18-telugu
Updated: May 22, 2020, 9:14 PM IST
విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల ఫలితాలు ప్రకటించిన ఓయూ..
ఉస్మానియా యూనివర్సిటీ
  • Share this:
ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన పలు పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్టు ఉస్మానియా యూనివర్సటీ పరీక్షల విభాగం ప్రకటించింది. అయితే వాస్తవానిక కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల ఓయూ పరిధిలో నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కంటే ముందే నిర్వహించిన కొన్ని పరీక్షల ఫలితాలు ఇప్పటికే ప్రకటించాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ వల్ల అది సాధ్యపడలేదు. తాజాగా లాక్‌డౌన్ నిబంధనల్లో కొంతమేర సడలింపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగం బీఈడీకి సంబంధించిన ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. విడుదల చేసిన వాటిలో బీఈడీ(లెర్నింగ్ డిజబిలిటీ), బీఈడీ(ఇంటలెక్చువల్ డిజబిలిటీ), బీఈడీ(హియరింగ్ ఇంపైర్డ్) కోర్సులకు సంబంధించి మొదటి సెమిస్టర్ ఫలితాలను ప్రకటించారు. ఫలితాల కోసం www.osmania.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
First published: May 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading