OSMANIA UNIVERSITY RELEASED DEGREE EXAMS RESULTS HERE IS RESULTS DIRECT LINK NS
OU Exam Results: ఉస్మానియా యూనివర్సీటీ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
ఉస్మానియా యూనివర్సీటీ విద్యార్థులకు అలర్ట్.. ఆ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) తాజాగా పలు కోర్సులకు సంబంధిచిన పరీక్షల ఫలితాలను (Exam Results) విడుదల చేసింది. విద్యార్థులు ఈ కింది లింక్ ద్వారా నేరుగా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.
ప్రముఖ ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) తాజాగా కీలక ప్రకటన చేసింది. యూనివర్సీటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సులకు (Degree Courses) సంబంధించిన ఫలితాలను (OU Results) విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేష్ ప్రకటన విడుదల చేశారు. బీఏ (BA), బీబీఏ(BBA), బీఎస్సీ(BSc) తదితర కోర్సులకు సంబంధించిన 1, 3,5,6 సెమిస్టర్ల బ్యాక్ లాగ్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. విద్యార్థులు (Students) తమ ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ https://www.osmania.ac.in/ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చని యూనివర్సిటీ తెలిపింది.
Step 4:అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవువుతంది. అక్కడ కనిపించే బాక్స్ లో 12 అంకెల హాల్ టికెట్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం సబ్మిట్ పై క్లిక్ చేయాలి. Step 5:దీంతో మీ రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ కాపీని ప్రింట్ తీసుకోవడం మంచిది. Bhasha Sangam App: కొత్త భాష నేర్చుకుంటారా? ఈ ఫ్రీ యాప్ మీకోసమే
ఇదిలా ఉంటే.. తెలంగాణ (Telangana) విద్యాశాఖ భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీకి (NEP) అనుగుణంగా భారీ మార్పులు చేపట్టింది. సాధారణంగా పాలిటెక్నిక్ కోర్సును విద్యార్థులు మూడేళ్ల పాటు చదవాల్సి ఉంటుంది. అయితే మూడేళ్ల పాటు చదవడం ఇష్టం లేకపోతే రెండేళ్లలోనే కోర్సు (Course) నుంచి వైదొలిగే అవకాశాన్ని కల్పించనుంది విద్యాశాఖ. ఉదాహరణకు ఓ విద్యార్థి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల కోర్సులో చేరి రెండేళ్లకే ఆ కోర్సు నుంచి నిష్క్రమించవచ్చు. GATE 2022: గేట్ 2022 పరీక్ష షెడ్యూల్ విడుదల.. జనవరి 3న అడ్మిట్‌కార్డులు రిలీజ్, ఫిబ్రవరిలో ఎగ్జామ్
దీంతో ఆ విద్యార్థికి ఆ కాలానికి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో సర్టిఫికేట్ ఇస్తారు. ఇంకా ఆ సర్టిఫికేట్ తెలంగాణ ఇంటర్ బోర్డ్ (Telangana Inter Board) జారీ చేసే రెండేళ్ల ఇంటర్ విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికేట్ కు సమానం. దీంతో ఆ విద్యార్థులు ఆ అర్హతతో బీఎస్సీ, బీకాం, బీఏ, బీబీఏ వంటి కోర్సుల్లో చేరొచ్చు. ఇంకా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లోనూ అడ్మిషన్ పొందొచ్చు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.