సివిల్ సర్వీస్ (Civil Services) పరీక్షల ఏటా లక్షల మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉంటారు. తమ కలల ఉద్యోగాన్ని సాకారం చేసుకోవడానికి లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇలాంటి అభ్యర్థులకు ఉస్మానియా యూనిర్సిటీ శుభవార్త చెప్పింది. ఉచితంగా సివిల్స్ కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(RRB), ఇతర బ్యాంకు ఎగ్జామ్స్(Bank Exams), తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించిన నియామక పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు యూనివర్సిటీ సోషియాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ గణేష్ ను సివిల్ సర్వీసెస్ అకాడమీ చైర్మన్ గా నియమించింది యూనివర్సిటీ. ఈ అకాడమీలో 600 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. అయితే ఈ అభ్యర్థులను ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనున్నారు. అయితే ప్రస్తుతం యూనివర్సిటీ, అనుబంధ కాలేజీల విద్యార్థులు అశోక్ నగర్ లోని అనేక కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రిపరేషన్ కోసం వారు యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీని వినియోగించుకుంటున్నారు.
అయితే విద్యార్థులు డబ్బులు వెచ్చించి కోచింగ్ ను తీసుకోకుండా వారికి ప్రయోజనం కలిగించాలన్నలక్ష్యంతో ఈ కోచింగ్ ను ప్రారంభిస్తున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు. త్వరలోనే సివిల్ సర్వీసెస్ తో పాటు ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కు సైతం శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నూతన అకాడమీలో సీనియర్ అధికారులు, పోలీస్ అధికారులతో అభ్యర్థులకు అవగాహన సదస్సులు సైతం నిర్వహించనున్నారు. తద్వారా అభ్యర్థులు పరీక్షలపై అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇంకా ఈ మాక్ అకాడమీలో ఎప్పటికప్పుడు మాక్ టెస్టులు సైతం నిర్వహించి విద్యార్థులు చేసే తప్పులను ఎప్పటికప్పుడూ సరిదిద్దనున్నారు.
అయితే అనేక సంస్థలు సైతం సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తాయి. ఏ ఏ సంస్థల్లో ఉచిత కోచింగ్ అందిస్తున్నారు? ఈ సంస్థల్లోకి ఎలా ప్రవేశం పొందాలి? వంటి వివరాలు మీ కోసం..
Career and Courses: మంచి జాబ్ సాధించాలనుకొటున్నారా.. ఈ కోర్సులు ట్రై చేయండి
సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అహ్మదాబాద్
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ప్రవేశానికి గుజరాత్ ప్రభుత్వం 2013లో సర్దార్ పటేల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (SPIPA) ఏర్పాటు చేసింది. ప్రవేశపరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఉచితంగా సివిల్ సర్వీసెస్ శిక్షణ ఇస్తుంది. ట్యూషన్ ఫీజు లేనప్పటికీ అభ్యర్థులు లైబ్రరీ డిపాజిట్‌గా రూ .2000, ట్రైనింగ్ డిపాజిట్‌గా రూ .5000 చెల్లించాలి. గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మరిన్ని వివరాలకు spipa.gujarat.gov.in సందర్శించండి.
ఆల్ ఇండియా కోచింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్, చెన్నై
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ అన్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కు చెందిన అనుబంధ సంస్థ. ఇది ఏటా ఇన్స్టిట్యూట్ 325 మందికి (225 రెసిడెన్షియల్, 100 నాన్-రెసిడెన్షియల్) ఉచిత శిక్షణ ఇస్తుంది. ఈ ఉచిత కోచింగ్ తమిళనాడు యువత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఈ ఉచిత కోచింగ్‌కు ఎంపిక చేస్తారు. Civilservicecoaching.com వెబ్సైట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Civil Services, Osmania University, TSPSC, UPSC