OU Exams: వాయిదా వేసిన పరీక్షల రీషెడ్యూల్ తేదీల ప్రకటన.. పూర్తి వివరాలివే..

OU Exams: ఇటీవల రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఓయూ ఎంబీఏ పరీక్షలను వాయిదా వేసింది. ఆ పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను తాజాగా ప్రకటించింది.

news18-telugu
Updated: October 21, 2020, 7:35 PM IST
OU Exams: వాయిదా వేసిన పరీక్షల రీషెడ్యూల్ తేదీల ప్రకటన.. పూర్తి వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇటీవల కురిసిన భారీగా వర్షాలకు హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. వీధులన్నీ చెరువులను తలపించాయి. అనేక కాలనీలను వరద నీరు ముంచెత్తింది. ఈ నేపథ్యంలో పలు యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ సైతం ఎంబీఏ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14, 15న జరగాల్సిన ఎంబీఏ పరీక్షలను వాయిదా వేస్తూ ఇటీవల యూనివర్సిటీ ప్రకటించింది. అయితే ఆ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయాన్ని ఆ సమయంలో ప్రకటించలేదు. తాజాగా ఆ పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను ప్రకటించారు. ఈ మేరకు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఓ ప్రకటన విడుదల చేశారు.



షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14న జరగాల్సి ఉన్న ఎంబీఏ నాలుగవ సెమిస్టర్ పరీక్షను గతంలో వాయిదా వేశారు. ఆ పరీక్షను నవంబర్ 5వ తేదీ, గురువారం నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న నిర్వహించాల్సి ఉన్న ఎంబీఏ 4వ సెమిస్టర్ పరీక్షను ఆ సమయంలో వాయిదా పడింది. ఆ పరీక్షను నవంబర్ 6 వ తేదీ, శుక్రవారం నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రెండు పరీక్షలను ఆ తేదీల్లో సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి మార్పులు ఉండవని యూనివర్సిటీ స్పష్టం చేసింది.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా..

భారీ వర్షాల నేపథ్యంలో అంబేద్కర్ యూనివర్సిటీ పలు పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21, 22, 23 తేదీల్లో జరగనున్న యూజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ తెలిపింది. ఈ తేదీల్లోని పరీక్షలు మినహా మిగతా అన్ని పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నట్లు తెలిపింది. వాయిదా వేసిన పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్న వివరాలను త్వరలో ప్రకటిస్తామని యూనివర్సిటీ ప్రకటించింది.
Published by: Nikhil Kumar S
First published: October 21, 2020, 7:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading