కరోనా వైరస్ సంక్షోభం కారణంగా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా పడుతున్నాయి. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TS EDCET 2020 కూడా వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు తేదీ లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 20న ముగిసింది. కానీ కరోనా వైరస్ ప్రభావం కారణంగా షెడ్యూల్లో మార్పులు తప్పలేదు. టీఎస్ ఎడ్‌సెట్ నిర్వహిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ దరఖాస్తు గడువును 2020 మే 15 వరకు పొడిగించింది. 2020 మే 23న జరగాల్సిన టీఎస్ఎడ్సెట్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనుంది ఉస్మానియా విశ్వవిద్యాలయం. అభ్యర్థులు అప్డేట్స్ కోసం https://edcet.tsche.ac.in/ వెబ్సైట్ ఫాలో కావాలి.
TS EDCET 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...
నోటిఫికేషన్ విడుదల- 2020 ఫిబ్రవరి 24
దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 27
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 15
టీఎస్ ఎడ్‌సెట్ 2020 పరీక్ష తేదీ- త్వరలో వెల్లడించనున్న ఉస్మానియా యూనివర్సిటీ
విద్యార్హత- ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ. కనీసం 50% మార్కులతో పాస్ కావాలి. బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్ పాసైనవారికీ అవకాశం. సైన్స్, మ్యాథ్స్ స్పెషలైజేషన్‌తో బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ 55% మార్కులతో పాస్ కావాలి.
వయస్సు- 2020 జూలై 1 నాటికి కనీసం 19 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు- జనరల్ విద్యార్థులకు రూ.650. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.450.
టీఎస్ ఎడ్‌సెట్ 2020 డీటెయిల్డ్ నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
NTA UGC NET 2020: యూజీసీ నెట్ జూన్ 2020 దరఖాస్తుకు మే 16 లాస్ట్ డేట్
Telangana Jobs: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో జాబ్స్
Telangana Jobs: తెలంగాణ హైకోర్టులో జాబ్స్... మే 15 లాస్ట్ డేట్Published by:Santhosh Kumar S
First published:May 04, 2020, 12:11 IST