news18-telugu
Updated: November 20, 2019, 2:40 PM IST
Ordnance Factory Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 4,805 జాబ్స్... పూర్తి వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)
రక్షణ శాఖకు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు-OFB ఏకంగా 4,805 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రిక్రూట్మెంట్ సెంటర్-OFRC త్వరలో డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. షార్ట్ నోటిఫికేషన్‌లోని వివరాల ప్రకారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా నాన్-ఐటీఐ, ఐటీఐ కేటగిరీలో 56వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రిక్రూట్మెంట్ సెంటర్. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆర్డినెన్స్ & ఆర్డినెన్స్ ఎక్యూప్మెంట్ ఫ్యాక్టరీల్లో వీరిని నియమించనుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి రిలీజ్ చేసిన షార్ట్ నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
OFRC Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం అప్రెంటీస్ ఖాళీలు- 4805
నాన్-ఐటీఐ అప్రెంటీస్ పోస్టులు- 1595
ఐటీఐ అప్రెంటీస్ పోస్టులు- 3210
విద్యార్హత- నాన్ ఐటీఐ కేటగిరీ పోస్టులకు 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష 50% మార్కులతో పాస్ కావాలి. మ్యాథ్స్, సైన్స్‌లో 40% మార్కులు ఉండాలి. ఐటీఐ కేటగిరీ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు.ఈ ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు-OFB అధికారిక వెబ్సైట్
http://www.ofb.gov.in ఓపెన్ చేసి ‘News & Announcements’ సెక్షన్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశముంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ఫాలో అవుతుండాలి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మోటో రేజర్ స్మార్ట్‌ఫోన్... ఎలా మడతపెట్టొచ్చో చూశారా?
ఇవి కూడా చదవండి:
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1113 మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జాబ్స్... అప్లికేషన్ లింక్ ఇదే
TSSPDCL Syllabus: 3025 ఉద్యోగాలకు ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఇదే
UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ మరో నోటిఫికేషన్
Published by:
Santhosh Kumar S
First published:
November 20, 2019, 2:40 PM IST