OFB Recruitment 2020: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 6060 పోస్టులు... తెలంగాణలో 438 ఖాళీలు

OFB Recruitment 2020 | తెలంగాణలోని మెదక్ జిల్లాలో గల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 పోస్టులున్నాయి. తెలంగాణతో పాటు చండీగఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

news18-telugu
Updated: January 2, 2020, 2:15 PM IST
OFB Recruitment 2020: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 6060 పోస్టులు... తెలంగాణలో 438 ఖాళీలు
OFB Recruitment 2020: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 6060 పోస్టులు... తెలంగాణలో 438 ఖాళీలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్-OFB భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్. గతంలో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ ఖాళీలను ప్రకటిస్తూ డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6060 ఖాళీలను ప్రకటించింది. అందులో 3847 ఐటీఐ పోస్టులు, 2219 నాన్ ఐటీఐ పోస్టులు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో గల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 పోస్టులున్నాయి. తెలంగాణతో పాటు చండీగఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 10న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 9 చివరి తేదీ.

OFB Recruitment 2020: ఖాళీల వివరాలివే...మొత్తం ఖాళీలు- 6060
తెలంగాణ- 438
చండీగఢ్- 46
మధ్యప్రదేశ్- 534
మహారాష్ట్ర- 1860ఒడిషా- 63
తమిళనాడు- 1080
ఉత్తర ప్రదేశ్- 1163
ఉత్తరాఖండ్- 228
పశ్చిమ బెంగాల్- 583

OFB Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 9
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు
విద్యార్హత- నాన్ ఐటీఐ అభ్యర్థులు 10వ తరగతి 55 శాతం మార్కులతో పాస్ కావాలి. మ్యాథ్స్, సైన్స్‌లో 40% మార్కులు ఉండాలి. ఐటీఐ పోస్టులకు ఐటీఐ పాస్ కావాలి.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోకియా నుంచి రూ.4,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండిఇవి కూడా చదవండి:

IAF Jobs: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు

RBI Recruitment 2020: డిగ్రీ పాసైనవారికి ఆర్‌బీఐలో 926 అసిస్టెంట్ జాబ్స్... హైదరాబాద్‌లో పోస్టులు

BECIL Recruitment 2020: గుడ్ న్యూస్... 4,000 పోస్టులతో జాబ్ నోటిఫికేషన్
First published: January 2, 2020, 2:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading