Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 6060 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

OFB Apprentice Recruitment 2020 | ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి.

news18-telugu
Updated: January 21, 2020, 3:44 PM IST
Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 6060 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 6060 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు కొద్ది రోజుల క్రితం అతిపెద్ద శుభవార్త చెప్పింది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్. ఏకంగా 6060 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 6060 పోస్టులు ఉంటే తెలంగాణలోని మెదక్ జిల్లాలో గల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 ఖాళీలున్నాయి. స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 ఫిబ్రవరి 9 చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఏ కోర్సు పాస్ కావాలి? విద్యార్హతలేంటీ? ఇతర వివరాలేంటో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Ordnance Factory Board Apprentice 2020: అప్లై చేయండి ఇలా



అభ్యర్థులు ముందుగా www.ofb.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
News & Announcements సెక్షన్‌లో 2020-01-10 డేట్‌తో ఉన్న లింక్ క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. కొత్త పేజీలో 56th batch of Trade Apprentices లింక్ పైన క్లిక్ చేయండి.
మీ వ్యక్తిగత వివరాలతో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, మార్కులు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.పనిచేస్తున్న మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ వెల్లడించాలి.
ఓటీపీ, ఇతర సమాచారం మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీకి వస్తాయి.
దరఖాస్తు చేసే సమయంలో కలర్ ఫోటో, ఆధార్ నెంబర్ దగ్గర ఉంచుకోవాలి.
ఆధార్ కార్డ్, 10వ తరగతి సర్టిఫికెట్, ఐటీఐ పాసైన సర్టిఫికెట్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, వికలాంగులైతే ఫిజికల్ డిజేబిలిటీ సర్టిఫికెట్ స్కాన్ చేసిన కాపీలు కావాలి.
ఆధార్ కార్డు లేనివాళ్లు ఓటర్ ఐడీ కార్డ్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఫోటో ఐడీకార్డ్, స్టూడెంట్ ఐడీకార్డ్, బ్యాంక్ పాస్ బుక్‌లో ఏదైనా ఒక ప్రూఫ్ ఉండాలి.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

TSPSC Jobs: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Bank Jobs: బ్యాంకు ఉద్యోగం కావాలా? ఈ నోటిఫికేషన్లకు అప్లై చేయండి

SBI Jobs: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో 7870 ఉద్యోగాలు... ఎగ్జామ్ సిలబస్ ఇదే
Published by: Santhosh Kumar S
First published: January 21, 2020, 3:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading