దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కళాశాలలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(IIT)లలో అడ్మిషన్ పొందడానికి సాధారణంగా జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ప్రతి సంవత్సరం జేఈఈ మెయిన్‌లో మొదటి 2.5 లక్షల ర్యాంకులు సాధించిన వారికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంటుంది. అయితే ఐఐటీలలో జేఈఈ అడ్వాన్స్డ్ మెరిట్‌తో మాత్రమే కాకుండా ఇతర అవకాశాల ద్వారా కూడా ప్రవేశాలు పొందవచ్చనే విషయం చాలామందికి తెలియదు. CEED ద్వారా డిజైన్ కోర్సులలో చేరే అవకాశం ఉన్నట్లే.. జేఈఈ అడ్వాన్స్డ్ లేదా ఐఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండానే అభ్యర్థులు ప్రవేశం పొందగలిగే అనేక ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి.
* IIT మద్రాస్ BSC డేటా సైన్స్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ 11, 12వ తరగతుల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, కెరీర్లో విరామం తీసుకొన్న వారికి ప్రోగ్రామింగ్, డేటా సైన్స్‌లో BSc కోర్సును అందిస్తోంది. 2022 మే నాటికి 11వ తరగతి పూర్తి చేసిన లేదా ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు క్వాలిఫైయర్ ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారు ప్రాసెస్‌కు అర్హత సాధిస్తే తమ 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత కోర్స్‌వర్క్‌ను ప్రారంభించవచ్చు. అంతేకాకుండా జేఈఈ అడ్వాన్స్డ్ 2021కి అర్హత ఉన్న వారు నేరుగా కోర్సులో చేరవచ్చు. సీట్ల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదు కాబట్టి అర్హత ఉన్న ఎవరైనా ప్రోగ్రామ్‌లో చేరవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 20.
* IIT గౌహతి మాస్టర్స్ ఇన్ లిబరల్ ఆర్ట్స్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గౌహతి 2022-2023 విద్యా సంవత్సరం నుంచి లిబరల్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. మొదటి బ్యాచ్‌లో 30 మంది విద్యార్థులు ఉంటారు. కోర్సులో భాగంగా విద్యార్థులు జియో స్పేషియల్ అనలిటిక్స్, డిజిటల్ హ్యుమానిటీస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, డిప్లమసీ, మాతృభాషా సాహిత్యం, భాషల అధ్యయనం, ఏరియా స్టడీస్ మొదలైన అంశాలను నేర్చుకుంటారు.
* ఒలింపియాడ్ క్వాలిఫైయర్స్
అంతర్జాతీయ ఒలింపియాడ్‌లకు అర్హత సాధించిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ లేకుండా నేరుగా IITలలో ప్రవేశం పొందవచ్చు. IITలు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఒలింపియాడ్స్‌లో పాల్గొన్న విద్యార్థులకు పోటీలో వారి పనితీరు ఆధారంగా అడ్మిషన్లు అందించడాన్ని పరిశీలిస్తున్నాయి. 2018లో IIT బాంబే అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌కు అర్హత సాధించిన అభ్యర్థులను నేరుగా BSc గణిత కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించింది.
* అనేక స్వల్పకాలిక సర్టిఫికేట్ కోర్సులు
డిజైన్ థింకింగ్‌లో IIT బాంబే సర్టిఫికేట్ ప్రోగ్రామ్:
ఇది ఐదు నెలల కోర్సు. వ్యాపారులు తమ ఉత్పత్తులు, సేవలు, కార్యకలాపాలు, కార్పొరేట్ వ్యూహాన్ని అభివృద్ధి చేసే విధానాలపై అవగాహన కల్పిస్తాయి. ఒక సంవత్సరం పని అనుభవంతో పాటు ఏదైనా స్ట్రీమ్ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
IIT రూర్కీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్:
IIT రూర్కీ ఆరు నెలల ఆన్లైన్ సర్టిఫికేట్ మెషిన్ లెర్నింగ్ కోర్సు అందిస్తోంది. ఈ కోర్సులో కృత్రిమ మేధస్సు అప్లికేషన్లను రూపొందించడానికి అవసరమైన నైపుణ్యాలను బోధిస్తారు. రూ. 112,500 ఫీజుతో కోర్సెరాలో కోర్సు అందుబాటులో ఉంది.
IIT మద్రాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్, రీజనింగ్:
ఈ 12 వారాల కోర్సు UG, PG విద్యార్థులకు అందిస్తున్నారు. పాఠ్యప్రణాళికలో ఫార్మలిజమ్స్, రీజనింగ్ అల్గారిథమ్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి. ఆన్లైన్లో స్వయంలో కోర్సు అందుబాటులో ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.