హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Open School Education: ఓపెన్ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. ఫీజుల చెల్లించేంద‌కు త‌త్కాల్ స్కీం

Open School Education: ఓపెన్ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. ఫీజుల చెల్లించేంద‌కు త‌త్కాల్ స్కీం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TS Open School | తెలంగాణ ప్ర‌భుత్వం ఓపెన్ స్కూల్ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. మే/జూన్ నెల‌లో నిర్వ‌హించ‌నున్న ఓపెన్ ఎస్సెస్సీ, ఇంట‌ర్ ప‌రీక్షా ఫీజు చెల్లించేందుకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్ఎస్‌) త‌త్కాల్ స్కీంను ప్ర‌క‌టించింది.

ఇంకా చదవండి ...

  తెలంగాణ ప్ర‌భుత్వం ఓపెన్ స్కూల్ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. మే/జూన్ నెల‌లో నిర్వ‌హించ‌నున్న ఓపెన్ ఎస్సెస్సీ, ఇంట‌ర్ ప‌రీక్షా ఫీజు చెల్లించేందుకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్ఎస్‌) త‌త్కాల్ స్కీంను ప్ర‌క‌టించింది. 2021-22 విద్యా సంవత్సరంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ కోర్సులో ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ అడ్మిషన్లు పొందిన అభ్యర్థులు, అంతకుముందు ఫెయిల్ అయిన అభ్యర్థులు, పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హులైనప్పటికీ పరీక్ష రుసుం సకాలంలో చెల్లించలేని అభ్యర్థులు ఇప్పుడు మే 1 నుంచి 7 వరకు చెల్లించవచ్చ‌ని తెలిపింది. ఈ త‌త్కాల్ స్కీం కింద‌ సాధార‌ణ ఫీజుకు అద‌నంగా ఎస్సెస్సీకి రూ. 500, ఇంట‌ర్మీడియెట్‌కు రూ. వెయ్యి చెల్లించాల్సి ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు తమ సంబంధిత స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్‌ను సంప్రదించాల‌ని ఓపెన్ స్కూల్ సొసైటీ సూచించింది.

  TS Gurukulas Admission: విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. బీసీ గురుకులాల్లో ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం.. వివ‌రాలు

  ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త ఫంథా.. 

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యాసంస్కరణలు చేపడుతూ కొత్త పంథాలో వెల్తోంది జగన్ సర్కార్. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల్లో (Government School) మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే పలు ప్రయోగాలు చేసింది. నాడు నేడు పేరుతో బిల్డింగ్ ల రూపు రేఖలు మార్చింది. ఇంగ్లీష్ మీడియం తప్పని సరి చేసింది. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమైంది.

  TCS Recruitment 2022: టీసీఎస్‌లో జాబ్ ఓపెనింగ్స్‌.. అర్హ‌త‌లు.. అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

  నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చి, అమ్మఒడి (Ammavodi) తో హాజరుశాతాన్ని పెంచుతున్న సర్కార్.. ఇప్పుడు టీచర్లతో పాటు విద్యార్ధులు కూడా స్కూళ్లకు మస్ట్ గా హాజరు అయ్యేలా చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా యాప్ ల సాయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న ఈ యాప్ లు త్వరలోనే పూర్తిస్దాయిలో అమల్లోకి తీసుకొచ్చేర ప్రయత్నాలు మొదలయ్యాయి.

  TSPSC Group-1: గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. పోస్టుల కేటాయింపుపై సందేహాలా.. ఈ విష‌యాలు తెలుసుకోండి

  ఏపీలో వైసీపీ ప్రభుత్వం (AP Government) అధికారంలోకి వచ్చాక స్కూళ్లలో పలు సంస్కరణలకు తెరదీసింది. స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు కోట్ల రూపాయల వ్యయంతో నాడు-నేడు పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం.. విద్యార్ధులను భారీగా స్కూళ్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అమ్మఒడి పథకాన్ని కూడా అమలు చేస్తోంది.దీంతో పాటు వారి హాజరును కచ్చితంగా నమోదు చేసేందుకు దారులు వెతుకుతోంది. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఢానం సాయం తీసుకుంటోంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Career and Courses, Distance Education, EDUCATION, Telangana

  ఉత్తమ కథలు