IRCTC: రూ.3,999 పెట్టుబడితో రైల్వే టికెట్ బుకింగ్ ఏజెన్సీ... లాభాలివే

IRCTC's authorized booking agent | ఏడాది ఏజెన్సీ కోసం రూ.3999, రెండేళ్ల ఏజెన్సీ కోసం రూ.6999 చెల్లించాలి. ప్రతీ నెలా 100 టికెట్లు బుక్ చేస్తే టికెట్‌కు రూ.10 ఛార్జ్ చేస్తుంది ఐఆర్‌సీటీసీ.

news18-telugu
Updated: April 27, 2019, 7:31 PM IST
IRCTC: రూ.3,999 పెట్టుబడితో రైల్వే టికెట్ బుకింగ్ ఏజెన్సీ... లాభాలివే
IRCTC: రూ.3,999 పెట్టుబడితో రైల్వే టికెట్ బుకింగ్ ఏజెన్సీ... లాభాలివే
news18-telugu
Updated: April 27, 2019, 7:31 PM IST
తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నారా? కేవలం రూ.3,999 ఉంటే చాలు... రైల్వే టికెట్ బుకింగ్ ఏజెంట్‌గా మారొచ్చు. ఐఆర్‌సీటీసీ కల్పిస్తున్న అవకాశమిది. ఐఆర్‌సీటీసీ ద్వారా కోట్లాది మంది నిత్యం రైల్వే టికెట్లు బుక్ చేస్తుంటారు. ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ద్వారా మీరూ డబ్బు సంపాదించొచ్చు. ఇందుకోసం మీరు ఐఆర్‌సీటీసీ ఆథరైజ్డ్ టికెట్ బుకింగ్ ఏజెంట్‌గా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మీకు నెలకు ఆదాయం లభిస్తుంది. మరి ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్‌‌లు ఎలాంటి సేవలు అందించొచ్చు? ఎలాంటి లాభాలు ఉంటాయి? తెలుసుకోండి.

ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్ కావాలంటే...


ఎవరైనా టికెట్ బుకింగ్ ఏజెంట్ కావొచ్చు. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ రెండు ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. ఏడాది ఏజెన్సీ కోసం రూ.3999, రెండేళ్ల ఏజెన్సీ కోసం రూ.6999 చెల్లించాలి. ప్రతీ నెలా 100 టికెట్లు బుక్ చేస్తే టికెట్‌కు రూ.10 ఛార్జ్ చేస్తుంది ఐఆర్‌సీటీసీ. 101 నుంచి 300 టికెట్లు బుక్ చేస్తే టికెట్‌కు రూ.8, అంతకన్నా ఎక్కువ బుక్ చేస్తే టికెట్‌కు రూ.5 చొప్పున ఛార్జీలుంటాయి. నాన్ ఏసీ క్లాస్ అయితే టికెట్‌కు రూ.20, ఏసీ క్లాస్ అయితే రూ.40 కమిషన్ లభిస్తుంది.

Read this: Indian Railways: మీరు ఎక్కిన రైలు డర్టీగా ఉందా? ఇలా కంప్లైంట్ చేయండి

ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్ అందించే సేవలివే...


1. ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్‌‌లు ఎన్ని టికెట్లైనా బుక్ చేయొచ్చు.


2. జారీ చేసిన టికెట్లను క్యాన్సిల్ చేయొచ్చు.
Loading...
3. సాధారణ ప్రజలకు తత్కాల్ టికెట్ అందుబాటులోకి వచ్చిన 15 నిమిషాల తర్వాత టికెట్లు బుక్ చేయొచ్చు.
4. రైల్వే ఏజెన్సీ తీసుకోవడానికి ట్రేడ్ లైసెన్స్ అవసరం లేదు.
5. మీ ఏజెన్సీ వివరాలు టికెట్‌పై ప్రింట్ కావు.
6. బుకింగ్ పోర్టల్‌లో ఏజెంట్లకు డైరెక్ట్ లాగిన్ సదుపాయం ఉంటుంది.
7. ఏజెంట్ వ్యాలెట్ నుంచి రైల్వే టికెట్ డబ్బులు డెబిట్ అవుతాయి.
8. టికెట్ బుకింగ్ ప్రాసెస్ వేగంగా జరుగుతుంది.

Realme 3 Pro: రిలీజైన రియల్‌మీ 3 ప్రో... ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

JIO offer: రిలయెన్స్ జియో నుంచి 'రియల్‌మీ యూత్ ప్లాన్'... లాభాలివే

SBI Loan: ఎస్‌బీఐలో ఎలక్ట్రిక్ వాహనాల లోన్‌పై డిస్కౌంట్

Jio GigaFiber: నెలకు రూ.600 చెల్లిస్తే బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ కనెక్షన్
First published: April 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...