ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు ఆన్లైన్ ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ (Online Open Book Exam) ఇప్పటికే ప్రవేశపెట్టింది. ఈ విధానానికి సంబంధించి ఢిల్లీ విశ్వవిద్యాలయం సోమవారం మార్గదర్శకాల (Guidelines)ను విడుదల చేసింది. ఈ విధానంలో విద్యార్థులు తప్పుడు మార్గాలు అనుసరించవద్దని సూచించింది. సమాధాన పత్రాలు అప్లోడ్ చేయడంలో ఆలస్యం అయితే డాక్యుమెంటరీ రుజువు (Documentary Proof) చూపాలని పేర్కొంది. యూనివర్సిటీ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు తమ స్క్రిప్ట్‌లను ఓపెన్ బుక్ ఎక్జామ్ పోర్ట్‌లో మాత్రమే సమర్పించాలని తెలిపింది.
ఢిల్లీ యూనివర్సిటీ విడుదల చేసిన మార్గదర్శకాలు..
- విద్యార్థులందరూ పరీక్ష రాసేటప్పుడు ఎలాంటి తప్పుడు మార్గాలు ఉపయోగించవద్దు.
- పరీక్షలు రాయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, కాపీయింగ్/పరీక్షలో అన్యాయమైన మార్గాలను ఉపయోగించడాన్ని గుర్తించే వ్యవస్థ అమలులో ఉందని తెలిపింది.
Samsung Jobs: ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్.. శామ్సంగ్లో 1,000 ఇంజనీరింగ్ జాబ్స్
- జూన్‌లో నిర్వహించిన ఓపెన్ బుక్ పరీక్షల్లో 350 మంది విద్యార్థులు (Students) నిబంధనలు అతిక్రమించడంతో పట్టుబడ్డట్టు పేర్కొంది.
- ఇలా పట్టుబడనివారి పేపర్ లేదా సెమిస్టర్ రద్దు చేసినట్టు పేర్కొంది.
- పోర్టల్‌లో (స్క్రిప్ట్‌ల) సమర్పణ ఒక గంట కంటే ఎక్కువ ఆలస్యమైతే, విద్యార్థులు OBE పోర్టల్‌లో స్క్రిప్ట్‌లను అప్లోడ్ చేయడానికి ఒక గంట అదనంగా ఉపయోగించవచ్చని తెలిపింది.
- ఈ సందర్భంలో విద్యార్థులు డాక్యుమెంటరీ సాక్ష్యాలను జత చేయాల్సి ఉంటుందని తెలిపింది. అంటే అప్లోడ్ చేయడంలో ఆలస్యానికి సంబంధించిన 4-5 స్నాప్షాట్లు ఇవ్వాలి.
- విద్యార్థులు సమాధానాలు రాయడానికి మూడు గంటల సమయం ఇస్తారు.
Railway Recruitment 2021: నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లికేషన్ ప్రాసెస్, అర్హతలు
ప్రరశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేయడానికి, స్క్రిప్ట్‌లను అప్లోడ్ చేయడానికి ఒక గంట వ్యవధి స్తారు. ఒక వేళ ఆలస్యంగా సమర్పించడానికి ఒక గంట సమయం ఉంటుంది. అదనపు సమయానికి డాక్యుమెంటరీ ఫ్రూఫ్ చూపాలి.
ఈ విధానంలో ధ్రువీకరణ ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియ కారణంగా ఈ-మెయిల్ ద్వారా సమర్పించిన స్క్రిప్టలను పరిశీలించడానికి సమయం పడుతుందని ఫలితంగా ఫలితాలు ఆలస్యం అవ్వొచ్చని యూనివర్సిటీ మార్గదర్శకాల్లో తెలిపింది. "ఈమెయిల్ ద్వారా పాక్షికంగా సమర్పించిన సమాధానాలు ఆమోదించబడవు". ఇమెయిల్ (E-Mail) మరియు పోర్టల్‌లో సమర్పించడం ఆమోదించబడదని బోర్డు స్పష్టం చేసింది. ఢిల్లీ యూనివర్సిటీలో నవంబర్ 30, 2021 నుంచి అన్ని విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్ (Post Graduate Program) లకు సంబంధించిన మూడు, ఐదు, ఏడు సెమిస్టర్ పరీక్షలను నిర్వహించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi University, EDUCATION, Exams, Online Education