హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main 2023: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ కు కొన్ని గంటలే సమయం.. దరఖాస్తు ఇలా..

JEE Main 2023: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ కు కొన్ని గంటలే సమయం.. దరఖాస్తు ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

JEE Main 2023: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE మెయిన్ 2023) ఏప్రిల్ సెషన్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఈరోజు మార్చి 12తో ముగుస్తుంది. అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE మెయిన్ 2023) ఏప్రిల్ సెషన్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఈరోజు మార్చి 12తో ముగుస్తుంది. అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. నేటి రాత్రి వరకు దరఖాస్తు ఫీజు చెల్లింపు ప్రక్రియ కూడా ముగుస్తుంది. JEE మెయిన్స్ సెషన్ 2 ఇంజనీరింగ్ మరియు ఆర్కిటెక్చర్/ప్లానింగ్ అభ్యర్థులకు నిర్వహించబడుతుంది. ఇంకా తమ దరఖాస్తును నమోదు చేసుకోని అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ను ఈరోజే పూర్తి చేయండి.

దరఖాస్తు ఫీజు..

రెండవ సెషన్‌లో కొత్త మరియు ఇప్పటికే ఉన్న అభ్యర్థులు ఇద్దరూ దరఖాస్తులు చేసుకోవచ్చు. సెషన్ 1లో తమ ఫారమ్‌ను నింపి.. పరీక్ష రుసుము చెల్లించిన అభ్యర్థులు నేరుగా రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ చేసి సెషన్ 2లో కనిపించడానికి కొన్ని వివరాలను అప్‌డేట్ చేయవచ్చు. అభ్యర్థులు పేపర్, మీడియం, స్టేట్ కోడ్ ఆఫ్ క్వాలిఫికేషన్, అడ్రస్ ప్రూఫ్, ఎగ్జామ్ సిటీలను మార్చుకోవడానికి అనుమతించబడతారు. అయితే.. సెషన్ 2 కోసం దరఖాస్తు చేయడానికి కొత్త అభ్యర్థులు ముందుగా నమోదు చేసుకోవాలి. దీంతో వారి మొబైల్ , ఈ మెయిల్ కు లాగిన్ వివరాలు పంపబడతాయి. వాటి సహాయంతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

పరీక్ష తేదీలు ఇలా..

జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 06, 08, 10, 11, 12, 13 మరియు 15 తేదీల్లో జరగాల్సి ఉంది. మొదటి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు కొన్ని రోజుల ముందు విడుదల చేయబడతాయి. హాల్ టిక్కెట్‌కు ముందు పరీక్షా కేంద్రాన్ని తెలుసుకోవడానికి సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల చేయబడుతుంది. తద్వారా అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన నగర సమాచారాన్ని పొందవచ్చు. ఈ స్లిప్స్ వెబ్ సైట్లో మార్చి చవరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులను ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించవద్దని ఎన్టీఏ హెచ్చరించింది.

మొత్తం 13 భాషల్లో పరీక్ష..

JEE మెయిన్-2023 సెషన్-2 పరీక్ష ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, కన్నడ, అస్సామీ, బెంగాలీ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా మొత్తంగా 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్ రెండు పేపర్లుగా ఉంటుంది. BTech/ BE కోర్సుల్లో ప్రవేశాలను పేపర్-1 ఆధారంగా చేపట్టనున్నారు. పేపర్-2 ద్వారా బ్యాచులర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్స్‌ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

CSIR UGC NET : సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. దరఖాస్తు ఇలా..

జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్..

జేఈఈ మెయిన్‌లో టాప్ 2.5 లక్షలలోపు ర్యాంక్‌ సాధించిన అభ్యర్థులు ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హులు. జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 30న ప్రారంభమవుతుంది. పరీక్షలు జూన్ 4న జరగనుంది.

అప్లికేషన్ ప్రాసెస్..

-ముందుగా జేఈఈ మెయిన్ అధికారిక పోర్టల్ jeemain-nta.nic.inను విజిట్ చేయాలి.

-ఆ తరువాత హోమ్ పేజీలోకి వెళ్లి, జేఈఈ మెయిన్ అప్లికేషన్ సెషన్-2 అనే లింక్‌పై క్లిక్ చేయాలి.

-దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వాలి.

-ఆ తరువాత అప్లికేషన్‌ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.

-ఆ తరువాత అప్లికేషన్‌ను క్రాస్-చెక్ చేసుకొని, ఫీజు చెల్లించండి.

-చివరగా భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ కాపీని సేవ్ చేసుకోండి.

First published:

Tags: Career and Courses, JEE Main 2023, JOBS

ఉత్తమ కథలు