Home /News /jobs /

Job Portal: వృద్ధుల కోసం ఆన్‌లైన్ జాబ్ ఎక్స్ఛేంజ్ పోర్టల్‌.. నేటి నుంచే అందుబాటులోకి..ప్రత్యేకతలు ఇవే..

Job Portal: వృద్ధుల కోసం ఆన్‌లైన్ జాబ్ ఎక్స్ఛేంజ్ పోర్టల్‌.. నేటి నుంచే అందుబాటులోకి..ప్రత్యేకతలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అసంఘటిత రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి నియామక ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి కృషి చేస్తోంది భారత ప్రభుత్వం. ఇందులో భాగంగా "ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ పోర్టల్" తో ఓ ముందడుగు వేసింది.

అసంఘటిత రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి నియామక ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి కృషి చేస్తోంది భారత ప్రభుత్వం. ఇందులో భాగంగా "ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ పోర్టల్" తో ఓ ముందడుగు వేసింది. నిరుద్యోగులను, కంపెనీ యాజమాన్యాలను ఒకే తాటిపై తీసుకురావడానికే జాబ్ ఎక్స్చేంజ్ పోర్టల్‌కు (Job exchange Portal) శ్రీకారం చుట్టింది. ఈ పోర్టల్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి.. కంపెనీ యాజమాన్యాలకు ఉద్యోగులు దొరికేలా చేయడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. నేటి నుంచి సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ (Ministry of Social Justice) ఈ జాబ్ పోర్టల్‌ని అందుబాటులోకి తీసుకురానుంది.

60ఏళ్లు లేదా అంతకంటే వయసు పైబడిన వారి కోసం 'సీనియర్ ఏబుల్ సిటిజన్స్ ఫర్ రీ-ఎంప్లాయిమెంట్ ఇన్ డిగ్నిటీ(Sacred)' అనే పోర్టల్‌ను ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రారంభించనుంది. ఉద్యోగావకాశాలు కోరుకునే సీనియర్ సిటిజన్లు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇది యజమానులకు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు "వర్చువల్ మ్యాచింగ్"గా పనిచేస్తుంది. తద్వారా వృద్ధులు ఎలాంటి శ్రమ పడకుండా ఉద్యోగాలు సంపాదించడం వీలవుతుంది.

Indian Navy Jobs : ఇండియ‌న్ నేవీలో వివిధ విభాగాల్లో 181 ఖాళీలు.. ప‌రీక్ష లేకుండానే ఎంపిక

సామాజిక న్యాయం, సాధికారత (Social Justice and Empowerment) శాఖ కార్యదర్శి, ఆర్.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఎక్స్చేంజ్ పోర్టల్ అనేది ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫామ్‌గా ఉంటుందని.. దీనిలో ఉద్యోగులు, యజమానులు ఒకరినొకరు వాస్తవంగా కలుసుకుని జాబ్స్ గురించి మాట్లాడుకోవచ్చని తెలిపారు. అలాగే మంత్రిత్వ శాఖ యజమానులను పోర్టల్ ప్లాట్‌ఫాంలోకి తీసుకురావడానికి.. వృద్ధులకు ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి సహాయం కోరుతూ సీఐఐ(CII), ఎఫ్ఐసీఐఐ(Ficci), అసోచాం(Assocham), ఇతరులకు కూడా లేఖలు రాసినట్లు సుబ్రమణ్యం వెల్లడించారు.

Railway jobs: ప‌దోత‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీలో 782 ఉద్యోగాలు

జాబ్ పోర్టల్ అందుబాటులోకి రాగానే సీనియర్ సిటిజన్లు తమ విద్యార్హత, అనుభవం, నైపుణ్యాల వివరాలు సబ్మిట్ చేసి నమోదు చేసుకోవచ్చు. జాబ్ ప్రొవైడర్లు పనితో పాటు పని చేసేందుకు కావాల్సిన ఉద్యోగుల సంఖ్యను పేర్కొంటారు. అలాగే అప్లై చేసేందుకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ వెల్లడిస్తారు. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడంలో సీనియర్ సిటిజన్లకు సహాయపడటానికి స్వచ్ఛంద సంస్థలను తీసుకురావాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. అయితే ఈ గవర్నమెంట్ పోర్టల్ ఏ ఉద్యోగానికి హామీ ఇవ్వదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

వృద్ధులు గౌరవంగా జీవించేలా ప్రోత్సహించేందుకు.. ఉపాధి విషయంలో వారికి సహాయ పడేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. సీనియర్ సిటిజన్ల సంఖ్య 1951 లో దాదాపు 2 కోట్ల నుంచి 2001 లో 7.6 కోట్లకు.. 2011 లో 10.4 కోట్లకు పెరిగింది.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Central governmennt, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు