హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NRA-CET: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. అన్ని నియామకాలకు ఆన్లైన్లో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్.. వివరాలివే..

NRA-CET: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. అన్ని నియామకాలకు ఆన్లైన్లో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అనేక కేంద్ర ప్రభుత్వ నియామకాలకు ఆన్లైన్లో ఉమ్మడి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు.

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అనేక కేంద్ర ప్రభుత్వ నియామకాలకు ఆన్లైన్లో ఉమ్మడి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. ఇక మీదట పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక చేయడానికి అభ్యర్థులను స్క్రీన్ చేయడానికి ఆన్లైన్లో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(CET) నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇదో వరమని ఆయన చెప్పారు. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించడానికి నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఏ) ను కేంద్ర కేబినెట్ ఆమోదంతో ఏర్పాటు చేశారు. నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీ గ్రూప్-B, గ్రూప్-C నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తుంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కొత్త సంస్కరణ ద్వారా ప్రతీ జిల్లాలో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తద్వారా అన్ని ప్రాంతాల్లోని అభ్యర్థులందరికీ సరైన అవకాశాలు ఏర్పడుతాయన్నారు. పరీక్షకు హాజరయ్యేందుకు అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురవ్వవన్నారు. పేద విద్యార్థులకు ప్రయాణ భారం ఉండదాన్నారు. మొదటి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను వచ్చే ఏడాది రెండో భాగంలో నిర్వహించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

నిరుద్యోగులకు అలర్ట్.. రూ. 31 వేల వేతనంతో DRDOలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు

దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఐఐటీ ఒకటి అన్న విషయం తెలిసిందే. ఈ ఐఐటీల్లో ఇటీవల తరచుగా టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉద్యోగం సాధించే అభ్యర్థులు వారికి వేలు, లక్షల్లో వేతనాలు పొందే అవకాశం ఉంటుంది. దీంతో ఇక్కడ ఉద్యోగం సాధించడానికి పోటీ అధికంగా ఉంటుంది. తాజాగా ఐఐటీ భువనేశ్వర్ (IIT Bhubaneswar) ఉద్యోగాల నియామకం కోసం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇవన్నీ నాన్ టీచింగ్ కు సంబంధించినవే. ప్రిన్సిపల్ నెట్వర్క్ ఇంజనీర్ విభాగంలో 1 పోస్టు, అసిస్టెంట్ రిజిస్టర్-1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్(సివిల్)-1, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్-1, సిస్టెం అడ్మినిస్ట్రేటర్-1, ప్రోగ్రామర్-1, స్పోర్ట్ర్స్ ఆఫీసర్-1, ప్రైవేట్ సెక్రటరీ-1, సిస్టం మేనేజర్-1 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ పోస్టులతో పాటు జూనియర్ హిందీ ఆఫీసర్-1, స్టాఫ్ నర్స్-1, జూనియర్ టెక్నికల్ సూరింటెండెంట్-3, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్-2, అసోసియేట్ సిస్టం అడ్మినిస్ట్రేటర్-1, అసిస్టెంట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్-1, వెబ్ డవలపర్-1, జూనియర్ టెక్నీషియన్-5, జూనియర్ లాబరేటరీ అసిస్టెంట్-4, జూనియర్ అసిస్టెంట్-3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు వారి విద్యార్హత ఆధారంగా రూ. 2.09 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

Notification

First published:

Tags: CAREER, Central cabinet, Exams, JOBS

ఉత్తమ కథలు