హోమ్ /వార్తలు /jobs /

Online Education: ఇక ఆన్‌లైన్‌లోనే గ్రాడ్యుయేష‌న్ చేయొచ్చు.. యూజీసి తాజా అనుమ‌తులు

Online Education: ఇక ఆన్‌లైన్‌లోనే గ్రాడ్యుయేష‌న్ చేయొచ్చు.. యూజీసి తాజా అనుమ‌తులు

UGC Guidelines | క‌రోనా త‌రువాత ఆన్‌లైన్ విద్య ఎక్కువ ప్రాచుర్యంలోకి వ‌చ్చింది. చాలా విద్యా సంస్థ‌లు ఆన్‌లైన్‌లో విద్య అందిస్తున్నా.. వాటికి గుర్తింపు ఉంద‌డం లేదు. తాజాగా యూజీసీ నిబంధ‌న‌లో ఆ స‌మ‌స్య తీరునుంది.

UGC Guidelines | క‌రోనా త‌రువాత ఆన్‌లైన్ విద్య ఎక్కువ ప్రాచుర్యంలోకి వ‌చ్చింది. చాలా విద్యా సంస్థ‌లు ఆన్‌లైన్‌లో విద్య అందిస్తున్నా.. వాటికి గుర్తింపు ఉంద‌డం లేదు. తాజాగా యూజీసీ నిబంధ‌న‌లో ఆ స‌మ‌స్య తీరునుంది.

UGC Guidelines | క‌రోనా త‌రువాత ఆన్‌లైన్ విద్య ఎక్కువ ప్రాచుర్యంలోకి వ‌చ్చింది. చాలా విద్యా సంస్థ‌లు ఆన్‌లైన్‌లో విద్య అందిస్తున్నా.. వాటికి గుర్తింపు ఉంద‌డం లేదు. తాజాగా యూజీసీ నిబంధ‌న‌లో ఆ స‌మ‌స్య తీరునుంది.

    క‌రోనా త‌రువాత ఆన్‌లైన్ విద్య (Online Education) ఎక్కువ ప్రాచుర్యంలోకి వ‌చ్చింది. చాలా విద్యా సంస్థ‌లు ఆన్‌లైన్‌లో విద్య అందిస్తున్నా.. వాటికి గుర్తింపు ఉంద‌డం లేదు. తాజాగా యూజీసీ (UGC) నిబంధ‌న‌లో ఆ స‌మ‌స్య తీరునుంది. ఇక‌పై ఆన్‌లైన్‌లో గ్రాడ్యుయేట్ చేసిన విద్యార్థులు నేరుగా కళాశాలకు వెళ్లి గ్రాడ్యుయేట్ (Graduate) చేసిన విద్యార్థులతో సమానంగా పరిగణించబడతాని యూజీసీ కొత్త రూల్స్‌ను ఏర్పాటు చేయ‌నుంది. దేశవ్యాప్తంగా 900 అటానమస్ కాలేజీల్లో ఆన్‌లైన్‌లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేందుకు త్వరలో కొత్త రూల్ అమల్లోకి రానుంది. గతంలో యూనివర్సిటీల్లో మాత్రమే ఆన్‌లైన్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకునే విధానాన్ని మార్చి దేశవ్యాప్తంగా 900 కాలేజీల్లో కొత్త విధానాన్ని అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్ణయించింది.

    Dyslexia: పాఠ‌శాల పిల్ల‌ల్లో "డైస్లెక్సియా" ల‌క్ష‌ణాలు.. అంటే ఏమిటి.. ప‌రిష్కారం ఏమిటి?

    న్యాక్ ప్ర‌మాణాలు పాటించాలి..

    యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ డిగ్రీ కోర్సుల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. కొత్త విద్యా విధానం ఆధారంగా 2035 నాటికి ఉన్నత విద్యలో విద్యార్థుల సంఖ్యను 50 శాతానికి పెంచే దేశవ్యాప్త డ్రైవ్‌లో భాగంగా ప్రారంభించ‌నున్నారు. ఆన్‌లైన్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను ప్రారంభించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ముందస్తు అనుమతి అవసరం లేదని UGC పేర్కొంది, అయితే ఆన్‌లైన్ డిగ్రీలు అందించే కళాశాలలు NAAC ప్రమాణంలో 3.26 స్కోర్‌ను కలిగి ఉండాల‌ని యూజీసీ స్ప‌ష్టం చేసింది.

    Jobs in Telangana: మ‌హ‌బూబాబాద్‌లో ఉద్యోగాలు.. నెల‌కు వేత‌నం రూ. 26,250.. ప‌రీక్ష లేకుండా నేరుగా ఇంట‌ర్వ్యూ!

    అంతే కాకుండా పరిశ్రమలు - విద్యాసంస్థల అనుసంధానికి మధ్య ఉన్న అంతరాలను తగ్గించడానికి శ్రీకారం చుట్టింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ( UGC). జాతీయ విద్యా విధానంలో భాగంగా ‘జీవన్ కౌశల్’ అనే స్కీమ్‌ను ప్రారంభించింది. ఇది ఇంగ్లీష్‌లోని 'లైఫ్ స్కిల్స్'ని అనువాదం చేస్తుంది. ఈ పథకం కింద ఉన్నత విద్యా సంస్థల్లో (HEI) అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం చేరిన విద్యార్థులపై దృష్టి సారిస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్లెక్సిబిలిటీ, టీమ్‌వర్క్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్, టైమ్ మేనేజ్‌మెంట్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ వంటి లైఫ్ స్కిల్స్‌పై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.

    Jobs in Telangana: సిద్దిపేట, సిరిసిల్లలో ఉద్యోగ అవ‌కాశాలు.. ప‌రీక్ష లేకుండా వాక్ ఇన్‌.. అర్హ‌త‌లు ఇవే!

    కరిక్యులంలో పేర్కొన్న విధంగా కోర్సును నాలుగు ప్రధాన విభాగాలుగా విభజించింది UGC. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్, లీడర్‌షిప్ & మేనేజ్‌మెంట్ స్కిల్స్, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్. మొదటి విభాగంలో కమ్యూనికేషన్ స్కిల్స్‌కు సంబంధించిన వెర్బల్, నాన్ వెర్బల్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో డిజిటల్ లిటరసీ, సైబర్ సెక్యూరిటీ, నైతికత, మన చుట్టూ కేంద్రీకృతమైన సోషల్ మీడియాపై శిక్షణ ఇవ్వనున్నారు.

    First published:

    ఉత్తమ కథలు