హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Online Degrees: విద్యార్థుల చెంతకే ఐఐటీ, ఐఐఎం.. ఆ కాలేజీలకు ఇక గడ్డు కాలమేనా?

Online Degrees: విద్యార్థుల చెంతకే ఐఐటీ, ఐఐఎం.. ఆ కాలేజీలకు ఇక గడ్డు కాలమేనా?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఆన్​లైన్ కోర్సుల వల్ల మహిళలు సైతం ఎక్కువగా చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారట. క్యాంపస్​కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్​లైన్​లోనే మంచి కోర్సులు అందుబాటులోకి వస్తుండడంతో వారు మళ్లీ డిగ్రీలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఆన్​లైన్​ ఎడ్యుకేషన్​ పెరిగిపోవడంతో విద్యావ్యవస్థలో వేగంగా మార్పులు వస్తున్నాయి. ఆన్​లైన్ కోర్సుల ద్వారా దేశంలోని టాప్​ ఇన్​స్టిట్యూట్లు చిన్న నగరాల విద్యార్థులకు సైతం చేరువవుతున్నాయి. ఐఐటీ, ఐఐఎంలో చదవడమంటే చాలా మంది విద్యార్థులకు కలలాంటిది. అలాంటివి ఆ టాప్ ఇన్​స్టిట్యూట్​లో ఆన్​లైన్ ద్వారా స్టూడెంట్స్​కు కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఐఐటీ, ఐఐఎం, హార్వర్డ్​లకు ఇప్పుడున్న విశిష్టమైన పేరే ఉంటుందా.. అదే విధంగా టాప్ ఇన్​స్టిట్యూట్​లు ఆన్​లైన్ కోర్సుల ద్వారా ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తుండడంతో సాధారణ కళాశాలలు నిలదొక్కుకోగలవా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

భారత్​లోని టాప్ ర్యాంకింగ్ ఇన్​స్టిట్యూట్​లు ఫుట్​టైమ్ డిగ్రీలను ఆన్​లైన్ ద్వారా బోధించవచ్చని 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనుమతి ఇచ్చింది. దీంతో దేశంలో మొట్టమొదటిసారి ఐఐటీ మద్రాస్​ అండర్ గ్రాడ్యుయేట్​ స్థాయి డిగ్రీ కోర్సును గతేడాది ప్రారంభించింది. ఇందులో బీఎస్సీ కోసం దాదాపు 30,276 దరఖాస్తులు వచ్చాయి. అందులో 20 శాతం మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్. దరఖాస్తు చేసిన అభ్యర్థి ఈ డిగ్రీని మూడు నుంచి ఆరు సంవత్సరాల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ అవకాశం రావడం లెర్నర్స్​కు చాలా ఉపయోగడుతుందని ఐఐటీ మద్రాస్ చెప్పింది.

ప్రపంచ వ్యాప్తంగా ఆన్​లైన్ కోర్సులను అందిస్తున్న కోర్సెరా ఈ విషయంపై స్పందించింది. ఆన్​లైన్​లో ఫుల్​టైమ్ డిగ్రీ కోర్సులకు విపరీతమైన డిమాండ్ పెరిగిందని వెల్లడించింది. రెండేళ్ల ముందు వరకు ఆన్​లైన్​లో షార్ట్​టర్మ్ కోర్సులకే ఎక్కువ డిమాండ్ ఉండేంది. అయితే ఇప్పుడు ఫుల్​టైమ్ డిగ్రీలు కూడా ఆన్​లైన్​లో చేసేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు.

ఇదివరకే డిగ్రీ పూర్తి చేసిన మరో సబ్జెక్టులో నైపుణ్యం కోసమే ఎక్కువ మంది విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్​ ఆన్​లైన్ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారని కొందరు నిపుణులు చెబుతున్నారు. త్వరలోనే ఆన్​లైన్ విద్య కూడా ప్రధాన అర్హతగా పేరుతెచ్చుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇక టైర్​-2 కళాశాల్లో చదివే కంటే ఆన్​లైన్​లో అత్యుత్తమ కాలేజీ నుంచి డిగ్రీ చేయాలని కూడా ఇప్పటికే కొందరు విద్యార్థులు ఆలోచిస్తున్నారని అంటున్నారు.

మరోవైపు ఆన్​లైన్ కోర్సుల వల్ల మహిళలు సైతం ఎక్కువగా చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారట. క్యాంపస్​కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్​లైన్​లోనే మంచి కోర్సులు అందుబాటులోకి వస్తుండడంతో వారు మళ్లీ డిగ్రీలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఆన్​లైన్​ డిగ్రీల వల్ల భారత్​లోని టాప్​ ఇన్​స్టిట్యూట్​లు ఎక్కువ మందికి చేరువవుతుంటే.. టైర్​-2, టైర్​-3 కళాశాలలకు మాత్రం కష్టాలు వచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా పోస్ట్​గ్రాడుయేషన్ స్థాయిలో కింది స్థాయి కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. నాణ్యమైన విద్య, ప్లేస్​మెంట్లు కల్పించలేకపోతున్న కళాశాలలు ఇక ఎంతో కాలం నడవలేవని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా టాప్ ఇన్​స్టిట్యూట్​లు కూడా ఆన్​లైన్ లేదా హైబ్రిడ్ డిగ్రీలను తక్కువ ఫీజులకే అందుబాటులోకి తెస్తుండడంతో విద్యార్థులు వీటివైపే మొగ్గు చూపుతారని చెబుతున్నారు.

ఆన్​లైన్ అమ్మకాలు, ఈ కామర్స్​ ప్రధాన వ్యాపార కేంద్రాలుగా మారిన విధంగానే ఆన్​లైన్ ఎడ్యుకేషన్​కు కూడా త్వరలోనే గణనీయంగా డిమాండ్ పెరుగుతుందని గ్రేట్ లెర్నింగ్​ ఫ్లాట్​ఫామ్​ సహ వ్యవస్థాపకుడు అర్జున్ నాయర్ అభిప్రాయపడ్డారు. నాసికరమైన లోకల్ కళాశాలల ఫీజుల కంటే తక్కువ మొత్తానికే టాప్ ఇన్​స్టిట్యూట్​ల నుంచి ఆన్​లైన్​ డిగ్రీలు చదివే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.

First published:

Tags: IIT, Online Education

ఉత్తమ కథలు