Home /News /jobs /

ONLINE COURSES THAT CAN GET YOU HARVARD CERTIFICATION FOR FREE DETAILS HERE GH VB

Harvard University: హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఫ్రీ ఆన్ లైన్ సర్టిఫికేషన్ కోర్సులు.. ఏయే విభాగాల్లో ఉన్నాయంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ ఒకటి. చాలా మంది, ఉన్నత విద్య కోసం ఈ యూనివర్సిటీని ఎంపిక చేసుకుంటారు. హార్వర్డ్ అందిస్తోన్న ఫ్రీ ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులు ఏవో చూద్దాం.

ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University) ఒకటి. చాలా మంది, ఉన్నత విద్య కోసం ఈ యూనివర్సిటీని ఎంపిక చేసుకుంటారు. ప్రస్తుతం ఈ వర్సిటీ వివిధ విభాగాల్లో ఆన్‌లైన్ కోర్సులను ఆఫర్(Offer( చేస్తోంది. కంప్యూటర్ సైన్స్(Computer Science), సోషల్ సైన్స్(Social Science), డేటా సైన్స్, హ్యుమానిటీస్, బిజినెస్(Business), హెల్త్ & మెడిసిన్(Health and Medicine), మ్యాథమెటిక్స్(Mathematics), ప్రోగ్రామింగ్, ఎడ్యుకేషన్ & ట్రైనింగ్‌(Training) విభాగాల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సులను పూర్తి చేసిన వారికి యూనివర్సిటీ సర్టిఫికేట్లను అందజేయనుంది. హార్వర్డ్ అందిస్తోన్న ఫ్రీ ఆన్‌లైన్ సర్టిఫికేషన్(Certificate) కోర్సులు ఏవో చూద్దాం.

* ది హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమెట్ చేంజ్
కోర్సు వ్యవధి ఏడు వారాలు. ఇందు కోసం విద్యార్థులు వారానికి 3 నుంచి 5 గంటల సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఈ కోర్సు ద్వారా వాతావరణ మార్పులు, గ్లోబల్ న్యూట్రిషన్, హెల్త్‌‌పై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఆన్‌లైన్ ద్వారా ఈ కోర్సును ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

* సిస్టమ్యాటిక్ అప్రోచ్ టూ పాలసీ డిజైన్
ఇది కోర్సు ద్వారా విద్యార్థులకు పబ్లిక్ పాలసీలపై అవగాహన కల్పించనున్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ కోర్సును ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ నుండి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

* యూజింగ్ పైథాన్ ఫర్ రీసెర్చ్
ఈ కోర్సును కూడా ఉచితంగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఇది ఐదు వారాల పాటు జరగనుంది. ఇందు కోసం విద్యార్థులు వారానికి 4 నుంచి 8 గంటల సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్, పైథాన్ పై అవగాహన కల్పించనున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.

Exclusive: Modi@8: రైతులను బంగారు వ్యవసాయ రంగం వైపు నడిపిస్తున్న కేంద్రం.. న్యూస్‌18తో కేంద్ర మంత్రి తోమర్‌..


* క్యాలిక్యులస్ అప్లైడ్
ఈ కోర్సు వ్యవధి పది వారాలు. ఇందుకు విద్యార్థులు వారానికి 3 నుంచి 6 గంటల సమయం కేటాయించాలి. ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు గణితంపై అవగాహన కల్పించనున్నారు. అలాగే ప్రాబ్లమ్‌లకు కాలిక్యులస్ ఎలా అప్లై చేయాలో వివరించనున్నారు. ఈ కోర్సును ఆన్‌లైన్లో ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ నుండి కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవాలి.

* ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ ఇన్ ఎమర్జింగ్ ఎకానమీస్
ఈ కోర్సు కోసం విద్యార్థులు వారానికి 3 నుంచి 6 గంటల సమయం కేటాయించాలి. విద్యార్థులకు మార్కెట్ పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. ఇది పూర్తిగా ఆన్‌లైన్ కోర్సు, ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందుకోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు చేసుకోవాలి. బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సును హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ తరుణ్ ఖన్నా బోధించారు.

* మైక్రో బ్యాచ్‌లర్స్ ప్రోగ్రామ్ ఇన్ యూనివర్సిటీ కెమిస్ట్రీ
ఈ కోర్సు 9 నెలల పాటు జరుగుతుంది. ఇందుకు విద్యార్థులు వారానికి 4 నుంచి 8 గంటల సమయం కేటాయించాలి. ఈ కోర్సు ద్వారా కెమిస్ట్రీ పరిణామం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఇది పూర్తిగా ఫ్రీ ఆన్‌లైన్ కోర్సు.

* డేటా సైన్స్- లీనియర్ రిగ్రెషన్
ఈ కోర్సు గడువు 8 వారాలు. ఇందుకు విద్యార్థులు వారానికి 1 నుంచి 2 గంటల సమయం కేటాయించాలి. ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు డేటా సైన్స్‌పై అవగాహన కల్పించనున్నారు. ఆన్‌లైన్ ద్వారా ఈ కోర్సును ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు చేసుకోవాలి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Certificate, Online

తదుపరి వార్తలు