ఇంటి నుంచే MITలో ఆన్‌లైన్ కోర్సులు చేయండి

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ప్ర‌పంచ‌లో ఉత్త‌మ యూనివ‌ర్సిటీల్లో ఒక్క‌టైన అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), భారతీయ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫాం హీరో వీర్డ్ MITతో క‌లిసి భార‌తీయ విద్యార్థుల కోసం ఆన్‌లైన్ కోర్సులు ప్రారంభించింది . మెరుగైన ఉద్యోగ అవ‌కాశాలు.. ఉన్న‌త విద్యా అవ‌కాశాల‌కు ఈ కోర్సులు ఉప‌యుక్తంగా ఉండ‌నున్నాయి.

 • Share this:
  ఇండియాలో ఇంట్లో ఉంటూనే ఆన్‌లైన్ కోర్సులు చేస్తూ ఉపాధి అవ‌కాశాలు పెంచుకోవ‌చ్చు. ఆన్‌లైన్ కోర్సులకు సంబంధించి ప్ర‌పంచ‌లో ఉత్త‌మ యూనివ‌ర్సిటీల్లో ఒక్క‌టైన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), భారతీయ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫాం హీరో వీర్డ్ MITతో క‌లిసి భార‌తీయ విద్యార్థుల కోసం కొన్ని ఆన‌లైన్ కోర్సులు ప్రారంభించింది. యూనివ‌ర్సిటీలు అందించే కోర్సుల‌కు సంబంధించి ఎడ్‌టెక్ అందించే పీజీ స‌ర్టిఫికెట్ MITx మైక్రోమాస్టర్స్ ప్రోగ్రామ్‌లతో అనుసంధానం చేయబడ్డాయి.
  ఆన్‌లైన్‌లో ఈ కోర్సులు పూర్తి చేసిన త‌ర్వాత ప్ర‌పంచంలోనే ఏ యూనివ‌ర్సిటీలోనైనా మాస్ట‌ర్స్ ప్రోగ్రామ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజ‌న్సి(AI), మిష‌న్ ల‌ర్నింగ్ (ML), డేటాసైన్స్ విభాగాల్లో ఆన్‌లైన్ కోర్సుల‌ను అందుబాటులో ఉంచింది. వీటితోపాటు ప‌రిశ్ర‌మ‌ల్లో ఉపాధి అవ‌కాశాలు వ‌చ్చే ఫైనాన్షియ‌ల్ టెక్నాల‌జీ స‌ర్టిఫికెట్ ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి.
  డేటా సైన్స్‌, ఫైనాన్స్ కెరీర్‌ల‌కు సంబంధించి 11 నెల‌లల్లో పూర్తి చేసేలా ప్రోగ్రాం కోర్సుల‌ను అందిస్తున్నారు. గేమ్ డిజైన్‌లో ఆరు నెలల స్వల్పకాలిక సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. గేమింగ్‌కు సంబంధించి ఈ కోర్సులు యువ‌కుల‌కు ఎంతో ఉప‌యుక్తంగా ఉండ‌నున్నాయని ఇండియ‌న్ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్ అధికారిక‌ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
  మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో క‌లిసి యువ‌త‌కు నాణ్య‌మైన విద్య అందించ‌నున్న‌ట్లు హీరో వీర్డ్ వ్య‌వ‌స్థాప‌కు, సీఈఓ అక్ష‌య్ ముంజ‌ల్ తెలిపారు. భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని కోర్సులు అందిస్తున్నామ‌ని అన్నారు. MITx మైక్రోమాస్ట‌ర్స్ ప్రోగ్రామ్ ద్వారా అందించే పీజీ స‌ర్టిఫికెట్‌తో ప్ర‌పంచంలోని ఏ యూనివ‌ర్సిటీలోనైనా మాస్ట‌ర్ ప్రోగ్రామ్ చేసేందుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌న్నారు. ఈ కోర్సుల ద్వారా నాణ్య‌మైన నిపుణులు అందుబాటులోకి వ‌స్తార‌ని ఉద్యోగ అవ‌కాశాలు ఉంటాయ‌ని ఆయ‌న దీమా వ్య‌క్తం చేశారు.
  నాణ్య‌మైన విద్య‌, కొత్త ప‌రిశోధ‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఈ కోర్సులు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని MITx డైరెక్టర్ డానా డోయల్ తెలిపారు. ఇండియాలో హీరో వీర్డ్‌తో క‌లిసి అందిస్తున్న‌ MITx కోర్సులు, MITx మైక్రోమాస్టర్స్ ప్రోగ్రామ్ పీజీ స‌ర్టిఫికెట్ ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని అన్నారు. యువ‌త‌కు కోర్సు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంద‌ని ఆయ‌న తెలిపారు.
  Published by:Sharath Chandra
  First published: