Home /News /jobs /

ONLINE COURSE MBA PROGRAM FROM BIRMINGHAM UNIVERSITY START THE APPLICATION PROCESS KNOW DETAILS HERE GH VB

Online Course: ఆ యూనివర్సిటీ నుంచి ఆన్‌లైన్ ఎంబీఏ ప్రోగ్రామ్.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కారణంగా ఆన్‌లైన్ కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. తాజాగా యూకేకు చెందిన బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ... విల్లే యూనివర్సిటీ సర్వీసెస్ భాగస్వామ్యంతో ఆన్‌లైన్ MBA ప్రోగ్రామ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

కరోనా(Corona)  కారణంగా ఆన్‌లైన్ కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. తాజాగా యూకేకు చెందిన బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ(University).. విల్లే యూనివర్సిటీ సర్వీసెస్ భాగస్వామ్యంతో ఆన్‌లైన్ MBA ప్రోగ్రామ్(Programme) కోసం నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు విల్లే యూనివర్సిటీ వెబ్‌సైట్ ద్వారా జూన్ 6లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆన్‌లైన్ ప్రోగ్రామ్(Online Programme) రెండున్నర ఏళ్ల పాటు జరగనుంది.

* అర్హత ప్రమాణాలు
బర్మింగ్‌హామ్ బిజినెస్ స్కూల్ నుండి ఆన్‌లైన్ MBA కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అర్హతలు ఇలా ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మూడు సంవత్సరాల BA/BAA/BCom/BSc/LLB లేదా నాలుగు సంవత్సరాల BE/బీ.టెక్ పూర్తి చేసి ఉండాలి.(చివరి గ్రేడ్ 60 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఇది UK 2:1కి సమానం) అదేవిధంగా మేనేజ్ మెంట్ స్థాయిలో కనీసం మూడేళ్ల వృత్తిపరమైన అనుభవం ఉండాలి.

* కోర్సు వివరాలు
ఈ ఆన్‌లైన్ ఎంబీఏ ప్రోగ్రామ్ మొత్తం 180 క్రెడిట్ పాయింట్‌కు సమానం. మొదటి సంవత్సరంలో, విద్యార్థులు కోర్ మాడ్యూల్స్ పూర్తి చేసి అవసరమైన వ్యాపార పరిజ్ఞానాన్ని పొందుతారు. అంతేకాకుండా అంతర్జాతీయ వ్యాపారం, వ్యూహం, కార్యకలాపాల నిర్వహణ, సంస్థాగత పరిస్థితులపై అభ్యర్థులు స్టడీ చేయనున్నారు. రెండో సంవత్సరంలో, విద్యార్థులు తమ కెరీర్ లక్ష్యాలకు అత్యంత దగ్గరగా ఉండే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్, అడ్వాన్స్‌డ్ బిజినెస్ స్ట్రాటజీ, బిజినెస్ ఎథిక్స్ వంటి ఆరు ఎలక్టివ్ మాడ్యూల్‌లను ఎంచుకోవాల్సి ఉంటుందని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ తెలిపింది.

Btech-Mtech Students: బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేషనల్ హైవే అందిస్తున్న ఆఫర్ ఇదే..


అలాగే ఈ ప్రోగ్రామ్ ద్వారా క్రెడిట్ బేస్డ్ రిసెర్చ్ ప్రాజెక్ట్‌ ఉంటుంది. ప్రోగ్రామ్‌ కోసం నమోదు చేసుకున్న విద్యార్థులు బిజినెస్ లీడర్స్, ఫ్యాకల్టీల ఆన్‌లైన్ లెక్చర్స్, ఆఫ్షనల్ ఆన్-క్యాంపస్ వర్క్‌షాప్‌లు, వర్చువల్ నెట్‌వర్కింగ్ ఈవెంట్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు. బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ ఇన్‌సైట్, ఎడ్యుకేషనల్ ఎంటర్‌ప్రైజ్ డైరెక్టర్ ఇయాన్ మ్యాట్ మాట్లాడుతూ... “ ఈ ఆన్‌లైన్ MBA ప్రోగ్రామ్ పరిశ్రమ భాగస్వామ్యాల సహాయంతో రూపొందించాం. విద్యార్థులు నేటి గ్లోబల్ మార్కెట్‌ప్లేస్ డిమాండ్‌లకు అనుగుణంగా తీర్చిదిద్దడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం’’. అని చెప్పారు.

విల్లే యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టాడ్ జిప్పర్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌తో దీర్ఘకాలిక అనుబంధాన్ని కొనసాగిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆన్‌లైన్ MBA ప్రోగ్రామ్‌‌కు మద్దతుగా నాణ్యమైన సేవలను డెలివరీ చేయడంలో రాజీపడబోమన్నారు. తద్వారా విద్యార్థులు ఎంతో ప్రయోజనం పొందుతారని జిప్పర్ అభిప్రాయపడ్డారు.

అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ కూడా వివిధ విభాగాల్లో ఆన్‌లైన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. కంప్యూటర్ సైన్స్, సోషల్ సైన్స్, డేటా సైన్స్, హ్యుమానిటీస్, బిజినెస్, హెల్త్ & మెడిసిన్, మ్యాథమెటిక్స్, ప్రోగ్రామింగ్, ఎడ్యుకేషన్ & ట్రైనింగ్‌ విభాగాల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Mba, Online course

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు