సైన్స్‌ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Indraprastha Institute of Information Technology) ప్రొఫెసర్ల కోసం కంప్యూటర్ సైన్స్‌లో సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కోర్సు కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా వర్చువల్ విధానంలో యూనివర్సిటీ అందిస్తుంది. ఈ కోర్సు బీఈ/ బీటెక్ అండ్ నాన్- ఇంజనీరింగ్ విభాగాలు బీఎస్సీ/ బీసీఏ / ఎంసీఏ నేపథ్యాల నుంచి వచ్చివారు చేసేందుకు రూపొందించిన సర్టిఫికెట్ ప్రోగ్రామ్ (Certificate Program) ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ (Computer Science) విభాగాల్లో ఉపాధ్యాయులు బోధనా సామర్థ్యాలు మెరుగు పర్చుకొనేందుకు రూపొందించిన కోర్సుగా యూనివర్సిటీ తెలిపింది. ఈ కోర్సు చేసేందుక ఇతర యూనివర్సిటీలు తమ అధ్యాపకులను ప్రోత్సహిస్తున్నాయి. అంతే కాకుండా అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మిషనరీ (Association for Computing Machinery) ఈ కోర్సు చేసేందుకు అధ్యాపకులను పాక్షిక ఆర్థిక చేయూత అందించనుంది.
కాలానికి అనుగుణంగా మార్పులు..
ప్రస్తుత పరిస్థుల్లో కంప్యూటర్ కోర్సు రంగంలో వేగవంతమైన మార్పులు చోటు చేసుకొంటున్నాయి.
NEET counselling 2021: ఫేక్ ఏజెంట్లతో జాగ్రత్త.. నీట్ కౌన్సెలింగ్‌పై ఎంసీసీ మార్గదర్శకాలు
ముఖ్యంగా మెషీన్ లెర్నింగ్ (Machine Learning), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ (DATA Science) విభాగాల్లో నిరంతరం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల కాలానికి అనుగుణంగా తమ నైపుణ్యం (Skills).. విషయ పరిజ్ఞానం మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంతుకోసం ఆధునికీకరించిన ఈ కోర్సుల ద్వారా కోర్సు అందిస్తున్నట్టు యూనివర్సిటీ తెలిపింది. ఈ సర్టిఫికెట్ ప్రొగ్రాం (Certificate Program) ఉపాధ్యాయులు వృత్తిపరంగా మెరుగ్గా రాణించేందుకు ఉపయోగపడుతుందిన ఐఐఐటీ ఢిల్లీ (IIIT ఢిల్లీ) అధికారిక నోటీసులో పేర్కొంది.
వారానికి 6 నుంచి 8 గంటల బోధన..
ఈ కోర్సు బోధించేందుకు ఆయా రంగాల్లో స్పెషలిస్టులను ఎంపిక చేసి బోధన అందించస్తారు. ముఖ్యంగా ఏఐసీటీ (AICTE) సెలబస్ నిబంధనలకు అనుగుణంగా పాఠ్యాంశాలను బోధిస్తున్నారు.
Wipro Recruitment: గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్.. విప్రోలో ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం
ఈ మాడ్యుల్ బోధనకు ఐఐటీ, ఐఐఐటీ విద్యావేత్తలను నియమించనున్నారు. ఈ కోర్సు మొదటి మాడ్యూల్ జనవరి 2022న ప్రారంభమవుతుంది. ఈ కోర్సు రెగ్యులర్ సెమిస్టర్లో పాఠ్యాంశాలు ఆన్లైన్ మాడ్యూల్ (Online Module)లను కలిగి ఉన్నందున ఫ్యాకల్టీ ఎప్పుడైనా సెలవు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి వారం, ప్రతి వారం దాదాపు 5 నుంచి 6 గంటల మొత్తం ప్రయత్నం కోసం, కొన్ని వారపు ప్రాక్టీస్ పనితో పాటు ఒక సింగిల్ సెషన్ జరుగుతుంది. ఒక ప్రోగ్రామ్ పూర్తి చేసిన తర్వాత హాజరైనవారు సర్టిఫికెట్ పొందుతారు.
ఈ కోర్సులో ప్రతీ మాడ్యూల్ ధర రూ. 10,000 అదనంగా జీఎస్టీ చెల్లించాలి. ఈ ఫీజులోనే ఆన్లైన్ క్లాస్‌లు, మెటీరియల్ (Material) అందిస్తారు. మాడ్యూల్ పూర్తి చేసుకొన్న వారు వారి డిపార్ట్మెంట్/ ఇన్స్టిట్యూట్ ద్వారా నిమినేట్ చేయబడతారు. వారానిఇక 6 నుంచి 8 గంటల పాటు కోర్సు విధానాన్ని నిర్ణయిస్తారు.
దీని ద్వారా అభ్యాసకులపై భారం తక్కువగా ఉంటుంది. ఐఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ రంజన్ బోస్ నోట్ ద్వారా ఈ కోర్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఈ కోర్సు బోధనాసామర్థ్యాలను మెరుగు పరుస్తుందని అన్నారు. ఇది అధ్యాపకులకు మాత్రమే కాదని విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుస్తుందిన ఆయన అన్నారు.
ఏఐసీటీ చైర్మన్ ప్రొఫెసర్ సహస్రబుదే ఈ కోర్సుపై మాట్లాడారు. ప్రస్తుతం కంప్యూటర్ విద్యావిధానంలో సృజనాత్మకంగా బోధించే నైపుణ్యం (Skills) ఉపాధ్యాయులకు లేదని అన్నారు. ఐఐటీ, ఎన్ఐటీ ఉపాధ్యాయుల్లో కొందరు అలా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్‌సైన్స్ ఉపాధ్యాయులకు ఈ నైపుణ్యం అందిచేందుకు ఈ కోర్సు ఉపయోగ పడుతుందని ఆయన అన్నారు.
దరఖాస్తు విధానం..
Step 1 : ముందుగా అధికారిక వెబ్సైట్ https://csedu.iiitd.ac.in/ ను సందర్శించాలి.
Step 2 : ప్రోగ్రామ్ వివరాలు.. ఫీజు సమాచారం పూర్తిగా చదవాలి.
Step 3 : అనంతరం Express Your Interest ఆప్షన్ క్లిక్ చేయాలి.
Step 4 : అక్కడ అప్లికేషన్ ఫాంలో అన్ని వివరాలు నమోదు చేయాలి.
Step 5 : కంప్యూటర్ సైన్స్‌లో ఏ ప్రోగ్రాం చదవాలనుకోవాలనుకొంటున్నారో ఆప్షన్ ఎంకొవాలి.
Step 6 : దరఖాస్తు పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Computer science, EDUCATION, New course, Online Education