news18-telugu
Updated: August 14, 2020, 12:41 PM IST
ఏపీలో ఈ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు... ఎప్పట్నుంచంటే
(ప్రతీకాత్మక చిత్రం)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవట్లేదు. అసలు తరగతులు, అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న స్పష్టత కూడా లేదు. ప్రైవేట్ స్కూళ్లు ఆన్లైన్ తరగతుల్ని నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ తరగతులే ఉత్తమ మార్గమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీటెక్, బీఫార్మసీ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల్ని నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. ఆగస్ట్ 17న ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. గతంలోనే ఈ కోర్సుల్లో జాయిన్ అయిన విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్లాసులు ఇవి. బీటెక్, బీఫార్మసీ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులతో పాటు ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సుల విద్యార్థులు ఈ ఆన్లైన్ క్లాసులకు హాజరుకావచ్చు.
SSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి 8 నోటిఫికేషన్ల ఎగ్జామ్ షెడ్యూల్ ఇదేONGC Jobs: ఓఎన్జీసీలో 4182 జాబ్స్... కాకినాడ, రాజమండ్రిలో ఖాళీల భర్తీ
ప్రస్తుత అకడమిక్ ఇయర్ అంటే 2020-21 విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు కాకుండా ఇప్పటికే బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్-AICTE అన్ని విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చింది. దీంతో జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ విద్యార్థులకు ఆగస్ట్ 17 నుంచి ఆన్లైన్ క్లాసులు నిర్వహించనున్నాయి. రెగ్యులర్ తరగతులు అక్టోబర్ 15 నుంచి ప్రారంభించే అవకాశం ఉంది.
మరోవైపు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు తుది పరీక్షల్ని కూడా నిర్వహించేందుకు విశ్వవిద్యాలయాలు కసరత్తు చేస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ పరీక్షలు మొదలుకానున్నాయి. సెమిస్టర్ పరీక్షల్ని జంబ్లింగ్ విధానం లేకుండా బ్యాచ్‌ల వారీగా నిర్వహించనున్నాయి.
Published by:
Santhosh Kumar S
First published:
August 14, 2020, 12:41 PM IST