Home /News /jobs /

ONLINE CLASSES PUTS PRESSURE ON SPECIAL NEEDS CHILDREN AND EXPERTS SUGGESTING FEW METHODS THAT HOW TO TEACH THEM PRV GH

Online Classes: డిజిటల్ క్లాసులతో ఆ పిల్లల విద్య అటకెక్కినట్లే.. ఈ పద్ధతులు పాటిస్తే మేలంటున్న నిపుణులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు మూతబడిన పరిస్థితి. దీనితో ఆన్‌లైన్ తరగతులు అనివార్యమయ్యాయి. కానీ ఈ వర్చువల్ క్లాసెస్​ అనేవి ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రతికూలంగా మారాయని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
ఒమిక్రాన్ (Omicron) కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు (schools) మూతబడిన పరిస్థితి. దీనితో ఆన్‌లైన్ తరగతులు (Online classes) అనివార్యమయ్యాయి. కానీ ఈ వర్చువల్ క్లాసెస్​ అనేవి ప్రత్యేక అవసరాల పిల్లలకు (Special needs children) ప్రతికూలంగా మారాయని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఎదిగే పిల్లలు (children) మానసికంగా, సామాజికంగా, శారీరకంగా ఎదిగేందుకు పాఠశాల దోహదం చేస్తుంది. ముఖ్యంగా మానవ సంబంధాలు (Human Relations) అభివృద్ధే లక్ష్యంగా బడులు పనిచేస్తుంటాయి. కరోనా కారణంగా పాఠశాలలు మూతబడినందున ఆన్​లైన్ తరగతులు(Online Classes) జరుగుతున్నాయి. అయితే ఇవి ప్రత్యేక అవసరాల పిల్లలకు తగిన విధంగా ఉండట్లేదు. వీరికి భౌతిక తరగతులు నిర్వహించడం చాలా ముఖ్యమని విద్యావేత్త, సామాజిక కార్యకర్త మహతాని లూత్రా (Mahatani Lutra, an educator and social activist) అంటున్నారు. ఢిల్లీకి చెందిన ఆమె మామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రోగ్రామ్, గురుగ్రామ్ మామ్స్ డైరెక్టర్​గా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక పిల్లల (Special needs children) అవసరాలేంటో ఆమె మాటల్లోనే..

* ఇలా అయితే కష్టమే..

దివ్యాంగులైన పిల్లలను.. వారి వారి ప్రత్యేక అవసరాలను (Special Needs Children) బట్టి కొన్ని రకాలుగా సూచిస్తుంటారు. నేనో ప్రత్యేక అవసరాలు గల బిడ్డకు తల్లిని. విలక్షణమైన న్యూరో సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గత రెండేళ్లుగా నా బిడ్డ చదువులు విషయంలో చెప్పుకోలేని వేదనను అనుభవిస్తున్నానని ఆమె వాపోతున్నారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే (Schools Re open)నాటికి ఢిల్లీలో కాలుష్యం(Pollution in Delhi) భూతం విరుచుకుపడింది. దీనితో స్కూళ్లు మూతపడ్డాయి. మొత్తంగా పిల్లలు ఇంట్లో ఉంటూనే చాలా కాలం గడిచిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ తరహా ధోరణి పిల్లలు, వారి సంరక్షకులపై శారీరకంగా, మానసికంగా (Mentally) ప్రభావం చూపుతుందని లూత్రా (Luthra) అంటున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను ఆమె ప్రస్తావించారు.

* హ్యూమన్ కనెక్ట్

చాలా మంది ప్రత్యేక అవసరాల పిల్లలు (Special Needs children) ఇతరులతో ఆత్మీయ సంబంధం కలిగి ఉంటారు. కరోనా మహమ్మారి (Covid-19 India) లాంటి భయాలు లేనట్లయితే ఇతరులకు దగ్గరగా జరిగి వారిని ముట్టుకుని కూర్చుంటారు. వారి భావాలను సైతం చాలా బాగా వ్యక్తీకరిస్తారు. వ్యక్తుల ముఖకవళికల ద్వారానే కొన్ని అంశాలను పసిగట్టగలరు. కానీ.. ఆన్​లైన్ క్లాసుల (Online classes)తో వారికి చాలా కష్టమవుతోంది.

సామాజిక పరస్పర చర్య: ప్రత్యేక అవసరాల పిల్లలు  (Special Needs children) సమాజంతో కలిసిపోవడం చాలా ముఖ్యం. కానీ డిజిటల్ క్లాసులతో (Digital classes) చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వారు నేర్చుకునే కొద్దిపాటి సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. నా కొడుకు క్లాస్‌మేట్ నా బిడ్డ కౌగిలింత (Hug) కోసం అతని వద్దకు వచ్చినప్పుడు ఎంతో సంతోషపడ్డానని చెప్పడం నాకు ఇంకా గుర్తుంది.

* తోటివారితో ఆటలు

పిల్లలు వారి తోటివారి నుంచి చాలా నేర్చుకుంటారు. మర్యాదలు, అలవాట్లు, సాధారణ ప్రవర్తనలను ఇతరులను చూసి అనుకరించి నేర్చుకుంటారు.

* రొటీన్

ప్రత్యేక అవసరాలు గల పిల్లలు దైనందిన దినచర్య (daily Routine) చాలా ముఖ్యం. అలా అయితేనే వారు చాలా ఎక్కువగా, తొందరగా నేర్చుకునేందుకు (learning) అవకాశం ఉంటుంది. ఇక పవర్ కట్ వంటి అంతరాయం కలిగినా.. వారు గందరగోళానికి గురవుతారు. వారిని తిరిగి క్లాస్ వినేలా చేయడం ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు సవాలేనని చెప్పవచ్చు.

* దృష్టి మళ్లింపు

ఆన్‌లైన్ పాఠశాలలో క్లాసులు వినే విద్యార్థులు కొంత నిర్లక్ష్యంగా ఉంటారు. ఉదాహరణకు నా కొడుకు యూట్యూబ్ వీడియోలను చూసేందుకు కొత్త ట్యాబ్‌లను తెరుస్తుంటాడు. (నవ్వుతూ).
Published by:Prabhakar Vaddi
First published:

Tags: EDUCATION, Online classes

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు