Online Classes: అడవులే ఆ విద్యార్థులకు స్కూళ్లు.. రోజూ అక్కడే చదువులు.. ఎందుకంటే...

Online Classes: అడవులే ఆ విద్యార్థులకు స్కూళ్లు.. రోజూ అక్కడే చదువులు..

Online Classes: చివరకు ఎలాంటి రోజులు వచ్చాయంటే... చదవుకుందామన్నా ఛాన్స్ లేకుండా పోతోంది. ఆ విద్యార్థులు పడుతున్న కష్టాలు తెలుసుకుంటే... అయ్యో అనిపించకమానదు.

 • Share this:
  Online Classes: ఈ కరోనా కాలంలో... విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు మరో రకం. అసలే ఆన్‌లైన్ క్లాసులు అంటే అంతంతమాత్రంగానే ఉంటాయి. టీచర్లు చెప్పేది సరిగా అర్థం కాదు. ఏదైనా డౌట్ అడుగుదామన్నా... అడిగే ఛాన్స్ ఉండదు. ఒకేసారి 50 మంది నుంచి 80 మంది విద్యార్థులకు ఆన్ లైన్ క్లాస్ చెప్పేస్తుంటే... విద్యార్థులు వినడం తప్ప వేరే ఏమీ చెయ్యలేకపోతున్నారు. అందువల్ల ఆన్‌లైన్ క్లాసులనేవి పేరుకే తప్ప... విద్యార్థులకు పెద్దగా ఉపయోగపడట్లేదు అన్నది తల్లిదండ్రుల మాట. ఇది ఇలా ఉంటే... ఒడిశాలో విద్యార్థులది మరో ఘోష. అక్కడి చాలా గ్రామాల్లో సెల్‌ఫోన్ సిగ్నల్స్ రావట్లేదు. వాటి కోసం వాళ్లు ఎక్కడ సిగ్నల్స్ దొరుకుతాయా అని వెతికితే... అడవుల్లో సిగ్నల్స్ దొరుకుతున్నాయి. వేరే దిక్కు లేక... రోజూ అడవుల్లోకి వెళ్లి చదువుకుంటున్న దయనీయ పరిస్థితి ఎదురైంది.

  ఈ దృశ్యాలు ఒడిశాలోని గంజాం జిల్లాలోనివి. అక్కడి విద్యార్థులకు చదువే కాదు... సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా అదని ద్రాక్షే అవుతున్నాయి. ఉదాహరణకు బిరులింగార్ అనే గ్రామం... ఎక్కడో కొండలపై ఉంటుంది. ఆ ఊరికి మొబైల్ నెట్‌వర్క్ సరిగా లేదు. కానీ రోజూ తెల్లారితే ఆన్‌లైన్ క్లాసులు తప్పట్లేదు. ఏం చెయ్యాలో అర్థం కాక విద్యార్థులు... తమ చేతుల్లో మొబైళ్లు పట్టుకొని... చుట్టుపక్కల అడవుల్లో తిరుగుతుంటే... ఒక్కొక్కరికీ ఒక్కో చోట సిగ్నల్స్ దొరుకుతున్నాయి. ఎలాగైనా చదువుకోవాలి... అనే కోరిక వారిని అడవుల బాట పట్టేలా చేస్తోంది. అక్కడ పాములు, దోమలు, రకరకాల కీటకాలు దాడి చేసే ప్రమాదం ఉన్నా... వారు అలాగే వెళ్లి చదువుకుంటున్నారు. రోజూ కిలోమీటర్లు నడిచి వెళ్లి... అడవుల్లో ఆన్‌లైన్ క్లాసులు పూర్తయ్యాక... తిరిగి ఇళ్లకు వస్తున్నారు.

  Online Classes: అడవులే ఆ విద్యార్థులకు స్కూళ్లు.. రోజూ అక్కడే చదువులు..


  గ్రామాల్లో ఇంటర్నెట్, సెల్ సిగ్నల్స్ ఉండాలి... అక్కడ లేకుండా... అడవుల్లో ఉండటమేంటన్నది ప్రజల నుంచి వస్తున్న విమర్శ. దీనిపై మొబైల్ సర్వీస్ ఆపరేటర్లు స్పందించట్లేదు. "అడవికి వెళ్లకపోతే... తమ చదువు దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో... తప్పనిసరై ఆ పిల్లలు అడవులకు వెళ్తున్నారు" అని టీచర్ వినీతా కుమారీ మిశ్రా తెలిపారు. "గతేడాది ఇంటింటికీ తిరిగి పాఠాలు చెప్పడానికి ప్రయత్నించాం. కానీ అలా చేస్తే... లెసన్స్ పూర్తవ్వట్లేదు. అందుకే ఆన్‌లైన్ క్లాసులు చెప్పాల్సి వస్తోంది" అని ఆమె వివరించారు.

  ఈ చదువులు సాగేదెలా?


  ఇది కూడా చదవండి: Video: ఆకాశం నుంచి చేపలు.. అసలు కథ వేరే ఉందిలే...

  "సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల చదువులే కాదు ఇంకా చాలా సమస్యలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నా... అంబులెన్స్‌కి కాల్ చెయ్యడానికి గంటల కొద్దీ టైమ్ పడుతోంది. ఈలోగా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటోంది" అని బిరులింగార్ గ్రామ వాసి ప్రకాష్ నాయక్ తెలిపారు. ఇలా ఒడిశాలోనే కాదు... ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంది. అందువల్ల కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయాలపై ఫోకస్ పెట్టాలనీ... సెల్ సిగ్నల్స్ దేశమంతా అన్ని గ్రామాల్లో వచ్చేలా చెయ్యాలని కోరుతున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: