ఆ విద్యార్థులకు నో ఆన్‌లైన్ పాఠాలు.. ఫీజు వసూలుపై కీలక నిర్ణయం..

ఆన్‌లైన్ తరగతులకు సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చాయని, దీంతో నిపుణులు, ప్రైవేటు విద్యా సంస్థలు, అధికారులతో చర్చలు జరిపామని మంత్రి సురేశ్ కుమార్ తెలిపారు.

news18-telugu
Updated: June 11, 2020, 7:09 AM IST
ఆ విద్యార్థులకు నో ఆన్‌లైన్ పాఠాలు.. ఫీజు వసూలుపై కీలక నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల కీలక సమయంలో పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వాలు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించాలని నిర్ణయించాయి. కర్ణాటకలోనూ ఇదే తరహాలో ఆ ప్రభుత్వం విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే ఆన్‌లైన్ పాఠాలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేజీ నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను రద్దు చేయాలని భావించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి ఎస్.సురేశ్ ఒక ప్రకటనను సైతం విడుదల చేశారు. కేజీ నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలను వెంటనే ఆపేయాలని, దీంతో పాటుగా ఆన్‌లైన్ తరగతుల పేరిట ఫీజు వసూలు చేయడం వెంటనే ఆపేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.

ఆన్‌లైన్ తరగతులకు సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చాయని, దీంతో నిపుణులు, ప్రైవేటు విద్యా సంస్థలు, అధికారులతో చర్చలు జరిపామని మంత్రి సురేశ్ కుమార్ తెలిపారు. ఆన్‌లైన్ తరగతులు, భౌతిక తరగతులకు ప్రత్యామ్నాయంగా ఉండలేవని అందరూ అభిప్రాయపడినట్టు చెప్పారు. ఇదిలావుంటే.. లాక్‌డౌన్ సమయంలో పిల్లలను ఏలా నిమగ్నం చేయాలనే దానిపైన మార్గదర్శకాలను సిద్ధం చేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీని ఏరా్పటు చేశారు. పాఠశాలలు తెరవడంతో స్పష్టత లేదని మంత్రి సురేశ్ కుమార్ పేర్కొన్నారు.

లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో మానవతా దృక్పథంతో పాఠశాలల ఫీజులను పెంచొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలావుంటే.. జూన్ 25 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని ఆయన చెప్పారు. జూన్ 25 నుంచి జూలై 4 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తున్నామని, విద్యార్థుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు.
Published by: Narsimha Badhini
First published: June 11, 2020, 7:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading