హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఐఐటీలో నాన్ టీచింగ్ జాబ్స్.. ఇలా అప్లై చేయండి

IIT Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఐఐటీలో నాన్ టీచింగ్ జాబ్స్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోనే పేరుగాంచిన విద్యాసంస్థలైన IITలు వరుసగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నాయి. తాజాగా ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గాంధీనగర్(IIT, Gandhinagr) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

దేశంలోనే పేరుగాంచిన విద్యాసంస్థలైన IITలు వరుసగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నాయి. తాజాగా ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గాంధీనగర్(IIT, Gandhinagar) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 37 నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ లాబరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ఎవరు అప్లై చేయాలంటే..

Librarian: ఈ విభాగంలో ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు. లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, డాక్యుమెంటేషన్లో P.hD చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.

Deputy Librarian: ఈ విభాగంలో రెండు పోస్టులను భర్తీ చేస్తున్నారు. లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.

Executive engineer: ఈ విభాగంలో ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.

Junior technical superintendent: ఈ విభాగంలో 3 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, బయోటెక్నాలజీ, కెమికల్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.

Junior superintendent: ఈ విభాగంలో మొత్తం 5 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా మాస్టర్ డిగ్రీ చేసి మూడేళ్ల అనుభవం ఉన్నవారు లేదా బ్యాచిలర్ డిగ్రీ చేసి ఐదేళ్ల అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.

Junior assistant: ఈ విభాగంలో మొత్తం 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 55 శాతం మార్కులతో డిగ్రీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. కంప్యూటర్ అప్లికేషన్స్ పై రెండేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి.

Junior laboratory assistant: ఈ విభాగంలో మొత్తం 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా విభాగంలో 55 శాతం మార్కులతో బీటెక్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఇతర విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.

Junior laboratory attendant or junior helper vacancy: ఈ విభాగంలో మొత్తం 5 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పదో తరగతి పాసై ఐటీఐలో ఏడాది పాటు మానిఫాక్చరింగ్, ఎలక్ట్రికల్, కెమికల్, సివిల్, కంప్యూటర్స్ సబ్జెక్టుల్లో ట్రేడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండి మూడేళ్ల అనుభవం ఉన్న వారు దరఖాస్తుకు అర్హులు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.

ఎవరు అప్లై చేయాలంటే..

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 25లోగా అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు రూ. 200 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, PwD అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

Application

Official Notification

First published:

Tags: Govt Jobs 2021, Gujarat, IIT, JOBS

ఉత్తమ కథలు