Home /News /jobs /

ONGC SCHOLARSHIP 2020 OIL AND NATURAL GAS CORPORATION OFFERS 500 SCHOLARSHIPS TO OBC CATEGORY STUDENTS SS

ONGC Scholarship: గుడ్ న్యూస్... 500 మంది ఓబీసీ విద్యార్థులకు ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్స్

ONGC Scholarship: గుడ్ న్యూస్... 500 మంది ఓబీసీ విద్యార్థులకు ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్స్
(ప్రతీకాత్మక చిత్రం)

ONGC Scholarship: గుడ్ న్యూస్... 500 మంది ఓబీసీ విద్యార్థులకు ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్స్ (ప్రతీకాత్మక చిత్రం)

ONGC Scholarship 2020 | విద్యార్థులకు శుభవార్త. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్-ONGC ఓబీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ని ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

    ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితులు సహకరించక ఉన్నత చదువులు చదవలేకపోతున్నవారికి ఆర్థికంగా చేయూతనిస్తోంది ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్-ONGC. ఓబీసీ విద్యార్థులకు 2019-2020 సంవత్సరానికి స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. 500 మంది ఓబీసీ విద్యార్థులకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.48,000 చొప్పున స్కాలర్‌షిప్ లభిస్తుంది. స్కాలర్‌షిప్ ప్రతీ ఏటా లభించాలంటే సెమిస్టర్ ఎగ్జామ్‌లో ప్రతీ సంవత్సరం 60% మార్కులు లేదా 6/10 గ్రేడ్ పాయింట్స్ సాధించాలి. ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఎంబీఏ, మాస్టర్స్ ఇన్ జియోఫిజిక్స్/జియాలజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్సులు చేస్తున్నవారే అప్లై చేయాలి. మొత్తం 500 స్కాలర్‌షిప్స్‌లో 50% అమ్మాయిలకు కేటాయించారు. ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్ పోర్టల్ https://www.ongcscholar.org/ ఓపెన్ చేసి విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు అప్లై చేయాలి. నార్త్, వెస్ట్, నార్త్ ఈస్ట్, ఈస్ట్, సౌత్ జోన్లకు 100 చొప్పున స్కాలర్‌షిప్స్ కేటాయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సౌత్ జోన్‌లోకి వస్తారు. ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసేముందు నియమనిబంధనలన్నీ పూర్తిగా చదివి అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.

    ONGC Scholarship 2020, Oil and Natural Gas Corporation Scholarship, OBC Scholarship, Degree Scholarship, how to apply for Scholarship, ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్ 2020, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ స్కాలర్‌షిప్, ఓబీసీ స్కాలర్‌షిప్, డిగ్రీ స్కాలర్‌షిప్, స్కాలర్‌షిప్ న్యూస్
    ప్రతీకాత్మక చిత్రం

    ONGC Scholarship 2020: స్కాలర్‌షిప్ పొందడానికి అర్హతలివే...


    మొత్తం స్కాలర్‌షిప్స్- 500 (ఇంజనీరింగ్- 300, ఎంబీబీఎస్- 50, ఎంబీఏ- 50, మాస్టర్స్ ఇన్ జియోఫిజిక్స్/జియాలజీ-100)
    అమ్మాయిలకు- 250 స్కాలర్‌షిప్స్
    విద్యార్హత- ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఎంబీఏ, మాస్టర్స్ ఇన్ జియోఫిజిక్స్/జియాలజీ ఫస్టియర్.
    కావాల్సిన సర్టిఫికెట్స్- క్యాస్ట్ సర్టిఫికెట్, 10వ తరగతి మార్క్స్ మెమో, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ విద్యార్థులైతే 12వ తరగతి మార్క్స్ షీట్, ఎంబీఏ, మాస్టర్స్ ఇన్ జియోఫిజిక్స్/జియాలజీ విద్యార్థులు డిగ్రీ మార్క్స్ షీట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్, పాన్ కార్డ్ కాపీలు ఇవ్వాలి.
    వయస్సు- 2020 జనవరి 1 నాటికి 30 ఏళ్లు.
    వార్షికాదాయం- రూ.2 లక్షల లోపు ఉండాలి.

    ONGC Scholarship 2020, Oil and Natural Gas Corporation Scholarship, OBC Scholarship, Degree Scholarship, how to apply for Scholarship, ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్ 2020, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ స్కాలర్‌షిప్, ఓబీసీ స్కాలర్‌షిప్, డిగ్రీ స్కాలర్‌షిప్, స్కాలర్‌షిప్ న్యూస్
    ప్రతీకాత్మక చిత్రం

    ONGC Scholarship 2020: అప్లై చేయండిలా...


    ముందుగా https://www.ongcscholar.org/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
    హోమ్ పేజీలో Apply Scholarship పైన క్లిక్ చేయండి.
    అందులో ONGC Scholarship for OBC Category UG - 2019-2020 పైన క్లిక్ చేయండి.
    గైడ్‌లైన్స్ చదివిన తర్వాత I Agree పైన క్లిక్ చేసి తర్వాత పేజీలోకి వెళ్లాలి.
    మీ వ్యక్తిగత వివరాలు, అడ్రస్, క్వాలిఫికేషన్ లాంటి డీటెయిల్స్‌తో దరఖాస్తు పూర్తి చేయాలి.
    ఓబీసీ విద్యార్థులకు స్కాలర్‌‌షిప్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Railway Jobs: భారతీయ రైల్వేలో 2792 ఉద్యోగాలు... పోస్టుల వివరాలివే

    Jobs: ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

    Railway Jobs: రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఉద్యోగాలు
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, EDUCATION, ONGC, Scholarship

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు